జాతీయ వార్తలు

రాజ్యాంగ విరుద్ధమో కాదో తేల్చండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమా కాదా అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా తేల్చాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుదేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ ఉద్ఘాటించారు. ఈ అంశంపై చట్టాన్ని చేసే పూర్తి అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ వౌలికంగా ఇది రాజ్యాంగ సమ్మతమా, విరుద్ధమా అన్న విషయాన్ని తేల్చాల్సింది సర్వోన్నత న్యాయస్థానమేనని ఆయన ఆన్నారు. అంటరానితనం, సతీ సహగమనం వంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను నిషేధించేందుకు గతంలో పార్లమెంట్ చట్టాలను తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్‌కు ఈ మేరకు అధికారం ఉన్నప్పటికీ ట్రిపుల్ తలాక్ విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదని దీని అర్థం కాదన్నారు. ‘ముస్లింల వివాహాలకు సంబంధించిన ట్రిపుల్ తలాక్‌ను తేల్చాల్సిందే..బంతి సుప్రీం కోర్టులోనే ఉంది’అని రోహద్గీ తెలిపారు. ట్రిపుల్ తలాక్ సహా విడాకులకు సంబంధించిన అన్ని మార్గాలను కోర్టు మూసివేసినట్టయితే కేంద్రం కచ్చితంగా కొత్త చట్టం తెస్తుందని తేల్చిచెప్పారు.