జాతీయ వార్తలు

ప్రతీకారం తీర్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 24: భారత్, పాకిస్తాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వాయుసేన చీఫ్ మరింత ఆజ్యం పోశారు. ‘శత్రువు భావితరాలు కూడా మరచిపోని రీతిలో ఎదురుదెబ్బ తీస్తాం’ అని పాక్ ఎయిర్‌చీఫ్ మార్షల్ సొహైల్ అమన్ బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు.
నౌషేరీ సెక్టార్‌లో భారత సైన్యం ఎలాంటి హెచ్చరికలు లేకుండా చేసిన దాడులపై సొహైల్ మాట్లాడారు. భారత్ దుస్సాహసం చేసిందని, ఇందుకు గట్టి గుణపాఠం చెప్తామని ఆయన స్పష్టం చేశారు. శత్రువు (్భరత్) ప్రకటనల పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. స్కర్దు ప్రాంతంలో మిరేజ్ ఫైటర్ జెట్ విన్యాసాలలో పాలుపంచుకునేందుకు వచ్చిన సొహైల్ విలేఖరుల ప్రశ్నలకు జవాబిచ్చారు. పాకిస్తాన్ వాయుసేన యుద్ధ సన్నద్ధతపై ఆయన సమీక్ష జరిపారు. పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ఫైటర్ జెట్లు బుధవారం ప్రపంచంలో అత్యంత ఎతె్తైన సియాచిన్ గ్లేసియర్‌పై చక్కర్లు కొట్టాయి. నిరుడు యూరి సెక్టార్‌లో 18మంది భారత జవాన్లను పాక్ ఉగ్రవాదులు హతమార్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ లక్షిత దాడులు నిర్వహించటం, అనంతరం కాశ్మీర్ లోయలో అల్లర్లు కొనసాగటం, పాకిస్తాన్ ప్రత్యేక దళాలు ఇద్దరు భారత సైనికుల తలలు నరికి తీసుకువెళ్లటం, ఆ తరువాత నౌషేరీ ఘటన వరుసగా రెండు దేశాల మధ్య వాతావరణానికి రోజురోజుకూ వేడెక్కిస్తున్నాయి. ఇప్పుడు పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ హెచ్చరికతో భారత దళాలు అప్రమత్తమయ్యాయి.
chitram...
పాక్ ఎయిర్‌చీఫ్ మార్షల్ సొహైల్ అమన్