జాతీయ వార్తలు

ప్రస్తుతానికి మాట్లాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: కాశ్మీర్ వేర్పాటువాదులతో ప్రస్తుతానికి చర్చలు జరిపే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా తెలియజేశారు. హింసాకాండను రెచ్చగొడుతున్న వేర్పాటువాదులతో చర్చల ఊసే ఉండదని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదని వివరించారు. అయితే సమస్య పరిష్కారంలో భాగంగా కాశ్మీర్ ప్రజలతో మాట్లాడతామని, వారి ఇబ్బందుల్ని కచ్చితంగా తీరుస్తామని అన్నారు. ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉన్న కాశ్మీరీ సంస్థల్లో హురియత్ కూడా ఉంటుందా అన్న ప్రశ్నకు ‘నేను అలా అనడం లేదు’అని జైట్లీ జవాబిచ్చారు. టెర్రరిస్టులు, వేర్పాటువాదుల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. అయితే సగటు కాశ్మీరీ పౌరుడి ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటామని, ఉగ్రవాదం, తీవ్రవాదంతో సతమతమవుతున్న వారిని ఆదుకుంటామని అన్నారు.