జాతీయ వార్తలు

ఫడ్నవిస్‌కు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 25: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు గురువారం ఘోరప్రమాదంనుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లాతూర్ సమీపంలోని నీలంగ ప్రాంతంలో కిందికి దిగే సమయంలో హెలికాప్టర్ పైనున్న తీగల్లో చిక్కుకుపోయి కూలిపోయింది. లాతూర్ సమీపంలో తమ హెలికాప్టర్ ప్రమాదానికి గురయిందని, అయితే తామంతా క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని ఫడ్నవిస్ స్వయంగా ఒక ట్వీట్‌లో తెలియజేశారు. హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి, హెలికాప్టర్ సిబ్బంది ఇద్దరు సహా ఆరుగురు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సికోర్‌స్కీ హెలికాప్టర్ బాగా దెబ్బతిన్నదని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఏ)కు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లాండింగ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ తీగల్లో చిక్కుకుపోయిందని ఆ అధికారి చెప్తూ, హెలికాప్టర్‌లోని మొత్తం ఆరుగురు ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా క్షేమంగా బైటపడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హెలికాప్టర్ పైలట్‌తోపాటుగా ఫడ్నవిష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు చేరువ కావడానికి భారతీయ జనతా పార్టీ రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న ‘శివర్ సంవాద్ సభ’ కార్యక్రమంలో పాల్గొనడానికి ఫడ్నవిస్ లాతూర్ వెళ్లారు. ప్రమాదం తర్వాత ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ, తాను క్షేమంగానే ఉన్నానని, హెలికాప్టర్‌కు చిన్న ప్రమాదం జరిగిందని, జనం పుకార్లను నమ్మరాదని అన్నారు. ఎవరూ గాయపడలేదని, తన మీడియా సలహాదారు కేతన్ పాఠక్ మాత్రం స్వల్పంగా గాయపడ్డారని ఫడ్నవిస్, 11 కోట్ల మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు. పైలట్‌కు కూడా తీవ్ర గాయాలు కాలేదని ఆయన చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ పరిధిలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇనె్వస్టిగేషన్ బ్యూరో (ఏఐబి) దర్యాప్తు జరుపుతుంది. ఇటీవల విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలిలో పర్యటించినప్పుడు సైతం ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సాంకేతిక ఇబ్బంది రావడంతో ఆయన నాగపూర్‌కు రోడ్డుమార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
chitram...
ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ ఫడ్నవిస్‌ను తోడ్కొని వస్తున్న భద్రతా సిబ్బంది