జాతీయ వార్తలు

భద్రతా లోపాలు నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జనవరి 5: భద్రతకు సంబంధించిన ‘కొన్ని లోపాలే’ పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి దారితీశాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం అంగీకరించారు. పాకిస్తాన్‌లో తయారైన ఆయుధాలను ఉపయోగించి ఈ దాడికి తెగబడిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదులూ హతమయ్యారని ఆయన చెప్పారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, శనివారం తెల్లవారు జామున 3.30 గంటల నుంచి సుదీర్ఘంగా 36 గంటలు పైగా సాగిన ఆపరేషన్‌లో ఆరుగురు తీవ్రవాదులూ హతమయ్యారని, అయితే గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, బుధవారం నాటికి ఇవి ముగియవచ్చని తెలిపారు. ఈ వైమానిక స్థావరంలో ప్రస్తుతం ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారెవరూ లేరని, అయినప్పటికీ గాలింపు చర్యలు పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని పారికర్ ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడి సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు భద్రతా సిబ్బందినీ అమరవీరులుగా పరిగణించి, యుద్ధం వంటి పరిస్థితుల్లో ప్రాణాలర్పించిన వారికి మాదిరిగా అన్ని ప్రయోజనాలను కల్పించడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. పఠాన్‌కోట్‌లో దాడికి తెగబడిన ఉగ్రవాదులు 40 నుంచి 50 కిలోల బుల్లెట్లు, మోర్టార్లను తీసుకొచ్చారని, కొన్ని మ్యాగజీన్లతో పాటు మాడిఫైడ్ అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ ద్వారా వీటిని ప్రయోగించారని తెలిపారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో తనకు ‘కొన్ని లోపాలు’ కనిపించాయని, అయితే అక్కడ భద్రతకు సంబంధించి ఎవరూ రాజీపడినట్లు భావించడం లేదని, ఏది ఏమైనప్పటికీ ఈ దాడిపై దర్యాప్తులన్నీ పూర్తయితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పారిక్కర్ చెప్పారు. అయితే ఈ దాడిపై జరుగుతున్న దర్యాప్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు.
24 కిలోమీటర్ల చుట్టుకొలతతో దాదాపు 2000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడగలిగారన్నది ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ దాడితో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధం గురించి విలేఖర్లు ప్రశ్నించగా, ముష్కరులు ఉపయోగించిన ఆయుధాల్లో కొన్ని పాక్‌లోనే తయారైనట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులు ఒక గార్డు కమెండోను మినహా ఎవరినీ నేరుగా హత్య చేయలేకపోయారని పారిక్కర్ తెలిపారు. అయితే ఈ దాడి సందర్భంగా దురదృష్టం వెంటాడటం వల్లనే డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ (డిఎస్‌సి)కి చెందిన ఐదుగురు సిబ్బందిని కోల్పోవలసి వచ్చిందని, కానీ వీరిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోవడానికి ముందు కడదాకా ఉగ్రవాదులతో పోరాడాడని పారిక్కర్ పేర్కొంటూ, వీరందరినీ దేశం కోసం సమున్నత త్యాగం చేసిన అమరవీరులుగా అభినందించారు.

చిత్రం... పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న పారికర్