జాతీయ వార్తలు

ద్వైపాక్షిక క్రికెట్ ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వస్తి పలకనంత వరకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ను అనుమతించేది లేదని కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ సోమవారం నాడిక్కడ ఉద్ఘాటించారు. 2012నుంచి నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల అంశంపై బిసిసి ఐ, పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు దుబాయ్‌లో సమావేశమైన తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించటం గమనార్హం. పాకిస్తాన్‌కు ఈ రకమైన ప్రతిపాదన చేసేముందు బిసిసిఐ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని గోయల్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ వీడేవరకు కేంద్రం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని అయితే బహుళపక్ష క్రీడలు అంటే ఐసిసి టోర్నమెంట్ల నిర్వహణ విషయంలో తాము చెప్పేదేమీ లేదని అన్నారు. 2015-2023 మధ్యకాలంలో అయిదు ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించేందుకు కుదిరిన ఎంఓయులను బిసిసిఐ ఉల్లంఘించిందని ఇందుకు గాను 387కోట్ల రూపాయల మేర నష్టపరిహారాన్ని చెల్లించాలని పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు ఇప్పటికే నోటీస్ పంపిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను తాము నిర్వహించజాలమంటూ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి సారథ్యంలో బిసిసి ఐ అధికారులు పిసిబికి వివరించనున్నట్లు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోని పక్షంలో ఎట్టి పరిస్థితిలోనూ నష్టపరిహారాన్ని చెల్లించే పరిస్థితి లేదని కూడా బిసిసి ఐ స్పష్టం చేసే అవకాశం కన్పిస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న పిసిబికి భారత్‌తో క్రికెట్ సిరీస్ జరగడమంటే పంట పండినట్లే.