జాతీయ వార్తలు

జిఎస్‌టితో ఆర్థిక పరిపుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 29: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పన్ను ఎగవేతలను నిరోధించడానికే కాకుండా భారత్ మరింతగా పన్నులను అంగీకరించే సమాజంగా పరివర్తన చెందడానికి దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) కొత్త క్యాంపస్‌ను సోమవారం ఇక్కడ జైట్లీ ప్రారంభించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులతో పాటు జూలై ఒకటి నుంచి అమలు కానున్న కొత్త జిఎస్‌టి వ్యవస్థలో వ్యాట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులకు నాసిన్ శిక్షణ ఇస్తుంది. నాసిన్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన అనంతరం జైట్లీ మాట్లాడుతూ జిఎస్‌టి వల్ల ఉపయోగాల గురించి చెప్పారు.
జిఎస్‌టి అమలులో కేంద్ర, రాష్ట్రాల పన్ను విధింపు అధికారుల మధ్య సరయిన సమన్వయం సాధించడంలో నాసిన్ వంటి అకాడమీలకు చాలా కీలక పాత్ర ఉందని ఆయన అన్నారు. జిఎస్‌టి సమాఖ్య భారత్‌కు చెందిన కొత్త పరోక్ష పన్ను అని, అందువల్ల రాష్ట్రాల, కేంద్ర పన్ను విధింపు అధికారుల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమన్వయాన్ని సాధించడంలో నాసిన్ వంటి అకాడమీలు ఎంతో కీలకపాత్ర పోషించవలసి ఉంటుందని ఆయన వివరించారు. అనేక రకాల పరోక్ష పన్నులు జిఎస్‌టి కింద ఒక్కటయ్యాయని, అందువల్ల ఈ జిఎస్‌టిని సవ్యంగా అమలు చేయడానికి సిబ్బంది తమ నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి ఉద్బోధించారు. పన్ను మదింపు అధికారులకు, పన్ను చెల్లింపుదారులకు మధ్య పరస్పర చర్యను తొలగించడం ద్వారా వేధింపులను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని గొప్పగా తీసుకురావొచ్చని జైట్లీ అన్నారు.
శక్తివంతమైన జిఎస్‌టి కౌన్సిల్ తన రెండు రోజుల సమావేశాన్ని మే 19న ముగించింది. శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో టెలికం, ఇన్సూరెన్స్, హోటళ్లు, రెస్టారెంట్లు సహా వివిధ సేవలకు నాలుగు శ్లాబులు 5, 12, 18, 28లుగా పన్ను రేట్లను నిర్ణయించింది.
chitram...
బెంగళూరులో సోమవారం నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్
కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ