జాతీయ వార్తలు

మరిన్ని పోస్ట్ఫాసుల్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభతరం కానుంది. దేశవ్యాప్తంగా పోస్ట్ఫాసుల్లో త్వరలో పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ల (పీఆర్‌ఎస్)లను ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. రైల్వే సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ రాజ్యసభలో ఇటీవల ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
సమీపంలో రైల్వే రిజర్వేషన్ కేంద్రాలు లేని ప్రాంతాల్లోని పోస్ట్ఫాసుల్లో పీఆర్‌ఎస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అయితే వాణిజ్య, సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనితీరుకు సంబంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ విషయం పేర్కొన్నారు. ఈ మేరకు తపాలాశాఖతో అవగాహన కుదుర్చుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 280 పోస్ట్ఫాసుల్లో పీఆర్‌ఎస్ కేంద్రాలు ఉన్నాయని, ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ద్వారా టికెట్ బుకింగ్‌కు ఆదరణ బాగా పెరిగిందని, టికెట్ రిజర్వేషన్లలో 65 శాతం ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.