జాతీయ వార్తలు

మసీదు తరలింపునకు సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 9:ఆయోధ్య వివాదంలో కీలకమైన మసీదును వివాదాస్పద ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదనకు వివిధ ముస్లిం వర్గాలు మద్దతు ప్రకటించాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. ఈ వివాదంపై అయోధ్యలో త్వరలో అతిపెద్ద సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో కోర్టు బయట పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం నెరపుతున్న రవిశంకర్ మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా శుక్రవారం నాడు వివిధ ముస్లిం వర్గాల ప్రతినిధులు బెంగళూరులో రవిశంకర్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. ఈ సమావేశం వివరాలను ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్, సున్నీ వక్ఫ్‌బోర్డ్‌తోపాటు వివిధ సంస్థలకు చెందిన పదహారు మంది ప్రతినిధులు శుక్రవారంనాడు రవిశంకర్‌తో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మేధావులు, ముస్లిం సంస్థల ప్రతినిధులు వారిలో ఉన్నారు. మసీదు తరలింపు ప్రతీపాదనను వారంతా సమర్థించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీశ్రీతో జరిపిన సమావేశంలో పాల్గొన్నవారిలో ముస్లిం పర్సనల్ లాబోర్డ్ కార్యనిర్వాహక సభ్యుడు వౌలానా సయ్యద్ సల్మాన్ హుస్సేన్ నద్వీ, యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డ్ చైర్‌పర్సన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ, లక్నోకు చెందిన తీలేవాలీ మసీదు వౌలానా వసీఫ్ హసన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ అనిస్ అన్సారీ ఉన్నారు. వీరితోపాటు సెంటర్ ఫర్ ఆబ్జెక్టివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (సీఓఆర్‌డీ) డైరక్టర్ అతార్ హుస్సేన్ సిద్దిఖి, వ్యాపారవేత్త ఏఆర్‌రెహ్మాన్, లండన్‌కు చెందిన వరల్డ్ ఇస్లామిక్ ఫోరం చైర్మన్ వౌలానా ఇసా మన్సూరీ, లక్నో న్యాయవాది ఇమ్రాన్ అహ్మద్, భారత హజ్ కమిటీ మాజీ చైర్మన్ అబూబకర్, బెంగళూరుకు చెందిన డాక్టర్ ముసా కైసర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వంలో భాగంగా రవిశంకర్ ప్రారంభించిన చర్చల ప్రక్రియపై మొదట పెదవివిరుపులు ఎదురైనా తాజా ప్రయత్నాలపై ఇరువర్గాల నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా శ్రీశ్రీ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు దూరంగా ఉన్న విశ్వహిందూ పరిషత్ తాజా పరిస్థితులపై పెద్దగా స్పందించలేదు. అయితే తమను విశ్వాసంలోకి తీసుకోకుండా శ్రీశ్రీ ఈ వివాద పరిష్కారానికి ప్రయత్నించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్, విశ్వహిందూ పరిషత్ గతంలో సమర్ధించలేదు. కాగా అదేనెలలో రవిశంకర్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన శ్రీశ్రీ ఈ చర్చలు ఎక్కడికి దారితీస్తాయో ప్రతి ఒక్కరికి తెలుసునని వ్యాఖ్యానించారు. కాగా శుక్రవారం అయోధ్య వివాదంపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.