జాతీయ వార్తలు

మీ వెంటే మేముంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేంద్రంలో ఆధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం పార్లమెంట్ లోపల, బయట ఏపీ ప్రజల వెంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీకి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని ఖర్గే గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ నేతృత్వంలో సంసద్ మార్గ్‌లో ‘ఆత్మగౌరవ దీక్ష’ పేరుతో వరసగా రెండోరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, డిఎంకే ఎంపీ కనిమొళి పాల్గొన్నారు. కనిమొళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం కేంద్రానికి ఉందని ఆమె స్పష్టం చేశారు. కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ స్వయంగా ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షకి వచ్చి 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే ఏపీకి అన్యాయం జరుగుతుందని కేవీపీ మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాదెండ్ల మనోహర్, శైలజానాథ్, బాపిరాజు, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. అనంతరం వీరంతా మాజీ ప్రధాని మాన్మోహన్ సింగ్‌ను కలిశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు వివరించడంతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను గురించి వివరించారు.