జాతీయ వార్తలు

భారత్‌పై విషం కక్కిన జైషే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిపిన దాడిని గొప్పగా ప్రకటించుకోవడమే కాకుండా కాశ్మీర్‌లో వందలాది మంది నిరాయుధులైన ముస్లింలను చంపిన భారత్ ఇప్పుడు తన సొంత సైనికుల శవాలను లెక్క పెట్టుకొంటోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జైషే మహమ్మద్ చీఫ్ వౌలానా మసూద్ అజర్‌కు చెందిన ఓ చిన్నపాటి ఆడియో సందేశాన్ని సైతం ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆ ఆడియో సందేశంలో మసూద్ పఠాన్‌కోట్ దాడిని నేరుగా ప్రస్తావించడమే కాకుండా దాడి చేసిన వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ ఆడియో సందేశం దాడి చేసిన ఉగ్రవాదులను తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతీయ ట్యాంకులు, హెలికాప్టర్లు, భారతీయ జవాన్లతో వీరోచితంగా పోరాడిన ‘ముజాహిదీన్’(అమరవీరులు)లుగా పేర్కొంది. ‘ఇండియా టుడే’ పత్రిక ఆ ఆడియో క్లిపింగ్ కాపీని సంపాదించింది. ‘శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నలుగురు ముజాహిదీన్‌లు భారత్‌కు చెందిన పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసారు. నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా భారత్ వాళ్లు ఎంతమందో వాళ్లు ఎలా వచ్చారో చెప్పలేకపోయింది’ అని అంటూ వౌలానా మసూద్ అజర్ జరిగిన సంఘటన గురించి వివరిస్తూ అన్నాడు. నలభై ఎనిమిది గంటల పాటు నిద్రాహారాలు లేకుండా ఎముకలు కొరికే చలిలో ముజాహిదీన్‌లు పోరాటం చేసారని మసూద్ అజర్ అన్నాడు. కాశ్మీర్‌లో నిరాయుధులైన ముస్లింలను హతమారుస్తున్న భారత్ ఇప్పుడు తన వాళ్ల మృతదేహాలను లెక్కపెట్టుకొంటోందని అన్నాడు. మృతుల్లో ప్రతిష్ఠాత్మక పతక విజేత సుబేదర్ ఫతేసింగ్, ఎన్‌ఎస్‌జి లెఫ్టెనెంట్ కల్నల్ నిరంజన్ సహా అనేక మంది ఉన్నారని తెలిపాడు. అసలెంతమంది ఉగ్రవాదులు పటాన్‌కోట్ పై దాడి చేసారన్న విషయం భారత్‌కు తెలియదని, అంతా గందరగోళమయంగానే ఉందని తెలిపాడు. మొదట నలుగురు ఉగ్రవాదులను చంపేసామని ప్రకటించిన భారత్ అనేక సందర్భాల్లో తన ప్రకటనలను మార్చుకుంటూ వచ్చిందన్నాడు. ‘ఇప్పుడు దిక్కుతోచక అరుస్తున్న ఆ పెద్ద దేశం పిరికి పందలా ఇతరులను నిందిస్తోంది’ అని అజర్ అన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నట్లుగా భావిస్తున్న అజర్ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద ప్రచారం చేస్తున్నాడు.