జాతీయ వార్తలు

దాడులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 14: నలభై మంది జిహాదీలను ఉరితీసిన సౌదీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహారీ పిలపునిచ్చాడు. పవిత్ర యుద్ధం చేస్తున్న వారిపై కత్తిగట్టిన వారిపై దాడులు చేయాలని కేడర్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆన్‌లైన్లో జవహారీ ఓ ప్రకటన చేస్తూ సౌదీలో అధికార రాచరిక పాలనపై దుమ్మెత్తిపోశారు. సౌదీ అరేబియా ప్రభుత్వం జనవరి 2న 47 మందిని ఉరితీసింది. 2003-2004లో సౌదీ ప్రజలు, విదేశీయులను హత్య చేశారన్న అభియోగంపై 47 మందిపైనా ఉరిశిక్ష అమలుచేశారు. అందులో 40 మంది జిహాదీలున్నారని ఆల్‌ఖైదా ఆరోపిస్తోంది. షియా మతగురువు అల నిమ్‌న్రు కూడా ఉరితీశారు. దీనిపై పెద్దఎత్తున షియాలు నిరసనలు చేపట్టారు. షియాలు ఎక్కువగా ఉండే ఇరాన్‌లో దాని ప్రభావం మరింత ఎక్కువ కనిపించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. రియాద్ అయితే ఏకంగా టెహరాన్‌తో ద్వైపాక్షి సంబంధాలు రద్దు చేసుకుంది.