జాతీయ వార్తలు

సల్వీందర్‌పై లై డిటెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19:పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడికి దారితీసిన పరిణామాలను శోధిస్తున్న ఎన్‌ఐఎ మంగళవారం సీనియర్ పోలీసు అధికారి సల్వీందర్ సింగ్‌పై నేర నిర్థారణ పరీక్ష జరిపింది. గత ఐదు రోజులుగా సల్వీందర్ సింగ్‌ను విచారిస్తున్నప్పటికీ ఆయన వెల్లడించిన వివరాల్లో పొంతన లేకపోవడం వల్ల ఈ పరీక్ష జరిపినట్టు అధికారులు తెలిపారు. బుధవారం కూడా ఈ పరీక్ష ద్వారా సల్వీందర్ నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. పంజాబ్ పోలీసుల ముందు సల్వీందర్ సింగ్ చెప్పిన దానికి, తమ ముందుకు వెల్లడించిన వివరాలకు ఎక్కడా పొంతన లేదని, అందుకే ఆయనపై లై డిటెక్టర్ పరీక్ష అవసరమని ఎన్‌ఐఎ అధికారులు ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ పరీక్షను ఎదుర్కొనేందుకు సల్వీందర్ కూడా అంగీకరించారు. ప్రస్తుతం సెంట్రల్ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన అధికారులు సల్వీందర్ సింగ్‌ను ప్రశ్నిస్తున్నారు. అసలు ఉగ్రవాద దాడి జరగడానికి దారితీసిన పరిస్థితుల క్రమాన్ని నిర్థారించేందుకే సల్వీందర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలను అతడి నుంచి కూలంకషంగా రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.