జాతీయ వార్తలు

విలువలతోనే యువత రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి వీలుగా దేశ ప్రజల్లో లౌకిక భావనలను మరింతగా శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం నాడిక్కడ ఉన్నత విద్యా సంస్థలు, సివిల్ సర్వీస్ సంస్థలను ఉద్దేశించి మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ దేశ యువతకు విలువ ఆధారిత విద్యను అందించడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుత ప్రవర్తనా సూక్తిని యువతలో బలంగా పాదుగొల్పాలని, దీనివల్లే భారత దేశ సమున్నత వైవిధ్యాన్ని అర్థం చేసుకోగలుగుతుందని స్పష్టం చేశారు.
భారత ఆదర్శాలను అవగతం చేసుకోవడానికి భిన్న భావనలను సమప్రాధాన్యతతో స్వీకరించడానికి ఈ రకమైన అవగాహన ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. భారతీయ ఆలోచనలోనే లౌకిక భావన బలంగా కనిపిస్తుందని, దీన్ని యువతలో మరింత పాదుగొల్పి సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేయాలన్నారు. లింగసమానత్వం గురించి కూడా మాట్లాడిన ఆయన, సమీకృత సమాజ నిర్మాణానికి ఇది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఇటీవలి కాలంలో దేశంలో అనేకచోట్ల మహిళలకు అమానుషాలు, అకృత్యాలు, హింసాత్మక దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేసిన రాష్టప్రతి, వీటికి దూరంగా సమానత్వ భావనతో యువత ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సంఘటనలన్నీ కూడా సామాజిక వైపరీత్యాలను, లోపాలను, దుష్ట ఆలోచనలను తొలగించేందుకు దోహదం చేయాలన్నారు.
మహిళలను గౌరవించడం సామాజిక పవిత్ర ధర్మమని, ఈ విలువలు మన నాగరిక జీవనంలోనే శక్తిని సంతరించుకున్నాయని తెలిపారు.
వీటన్నింటినీ కూడా భారత రాజ్యాంగం మరింత పరిపుష్టం చేసిందని వెల్లడించారు. ఇళ్లలోనూ, విద్యా సంస్థల్లోనూ కూడా మహిళ పట్ల గౌరవ భావనను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిచేయాలన్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఎదిగేకొద్దీ మహిళల పట్ల గౌరవ భావం పెరుగుతుందని, ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను సంతరించుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించకుండా సమీకృత సమాజ నిర్మాణం సాధ్యం కాదని వెల్లడించారు. సమాజార హక్కు చట్టం, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, విద్య, ఆహార భద్రత వంటి ప్రాథమిక అంశాలను నాటి యుపిఏ సర్కార్ చట్టబద్ధమైన హామీని కల్పించిందని రాష్టప్రతి తెలిపారు. అలాగే ఇటీవల ఎన్డీయే సర్కార్ చేపట్టిన అనేక కార్యక్రమాలు కూడా డిజిటల్ భారత ఆవిష్కరణకు, ఆదర్శ గ్రామాల విస్తరణకు దోహదం చేసేవేనని వెల్లడించారు.
చిత్రం..
రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ఉన్నత విద్యా సంస్థలు, సివిల్ సర్వీస్ సంస్థలను
ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రణబ్ ముఖర్జీ