జాతీయ వార్తలు

సోషల్ మీడియా ఓ బలమైన ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 27: సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు సంయమనం, క్రమశిక్షణ పాటించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భద్రతా జవాన్లకు పిలుపునిస్తూ పోలీసు దళాలు ఈ మాధ్యమాన్ని తమకు అనుకూలంగాను, ప్రజలతో సంబంధాలను పెంచుకోవడానికి ఓ సాధనంగాను ఉపయోగించుకోవాలని అన్నారు. అంతేకాదు, పోలీసులు స్థానికులతో ఉన్న విశ్వాస లోపాన్ని తగ్గించుకోవడం ఎంతయినా ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు. కేరళలోని తిరువనంతపురానికి దగ్గర్లో ఉన్న కోవలం వద్ద ‘నేషనల్ కమ్యూనిటీ పోలీసింగ్ కంక్లేవ్-2016’ను రాజ్‌నాథ్ బుధవారం ప్రారంభించారు. పోలీసులు సామాజిక మాధ్యమాన్ని పూర్తిశక్తితో వినియోగించుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని. ప్రజలతో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఒక సాధనంగా వారు దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ‘సోషల్ మీడియా పోలీసులకు ఒక బలమైన ఆయుధంలాంటిది. ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి వారు దాన్ని ఉపయోగించుకోవాలి’ అని అన్నారు. అయితే సంయమనం, క్రమశిక్షణతో దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ వైపు నేరాల తీరుతెన్నులు మారిపోతుండడం, వాటి సంక్లిష్టత, మరో వైపు పోలీసులనుంచి ప్రజల ఆశలు ఆకాంక్షలు పెరిగిపోవడం కారణంగా వారి ముందున్న సవాళ్లు బహుముఖమైనవిగా మారుతున్నాయని అన్నారు. శాంతిభద్రతల సమస్యలతోపాటుగా ఉగ్రవాదం కూడా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంతో పాటుగా ఇంటర్నెట్, సోషల్ మీడియాల కారణంగా సమాజంలో వచ్చిన మార్పులు సైతం పోలీసులకు పెను సవాళ్లుగా మారుతున్నాయని, అలాగే పోలీసింగ్ జరపాల్సిన తీరును సైతం పూర్తిగా మార్చివేశాయని ఆయన అన్నారు. ఓ వైపు కొత్త టెక్నాలజీలు శాంతిభద్రతలను అమలు చేసే ఏజన్సీలకు ఆధునిక కాలంలో జరిగే నేరాలు, నేరగాళ్లను ఎదుర్కోవడానికి పోలీసులకు తోడ్పడుతూ ఉంటే మరో వైపు అవి నేరగాళ్లకు సైతం బలమైన ఆయుధాలుగా మారుతున్నాయని అన్నారు. సామాజిక పోలీసింగ్ అనేది మన పోలీసింగ్ విధానంలో ఒక భాగంగా ఉండాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్, స్థానికులతో సంబంధాలను పెంపొందించుకోవడంపై జాతీయ స్థాయిలో ఒక కార్యాచారణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేరళ హోమ్ మంత్రి రమేశ్ చెన్నితల మాట్లాడుతూ, కేరళలో ఎనిమిదేళ్ల క్రితమే సామాజిక పోలీసును ప్రవేశపెట్టారని, అది ఎంతో గొప్పగా విజయవంతమైందని చెప్పారు. ప్రజలనుంచి దానికి పూర్తి మద్దతు లభించిందని ఆయన చెప్పారు. అంతేకాదు, పోలీసులకు, ప్రజలకు మధ్య ఉన్న అగాథాన్ని తగ్గించడానికి సైతం అది తోడ్పడిందని చెన్నితల అన్నారు.
chitram...

తిరువనంతపురంలో బుధవారం ‘నేషనల్ కమ్యూనిటీ పోలీసింగ్’ సదస్సును
ప్రారంభిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్