జాతీయ వార్తలు

రోహిత్ ఆత్మహత్యపై ఏకసభ్య కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ రూపన్‌వాలా సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించింది. రోహిత్ ఆత్మహత్య కారణాలతో పాటు వరుసగా జరిగిన సంఘటనలు, దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలపై కూడా జస్టిస్ అశోక్ కుమార్ విచారణ జరుపుతారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను కూడా ఈ కమిషన్ సూచిస్తుంది. సమగ్ర విచారణ నివేదికతో పాటు తగిన సిఫార్సులతో మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిషన్‌ను కేంద్రం కోరింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు అందించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ న్యాయవిచారణ కమిషన్‌ను నియమించిది. రోహిత్ ఆత్మహత్య కారణాలు పరిణామాలు, వాస్తవాలను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్ రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి, మరో పక్క ఐఐటి చెన్నైకి రెండు బృందాలను పంపించేందుకు పార్లమెంటు ప్యానల్ సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. బిజెపి సభ్యుడు ఫగ్గన్ సింగ్ అధ్యక్షతేన పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ బుధవారం నాడు సమావేశమైనపుడు ఈ అభిప్రాయం వ్యక్తమైంది. సమావేశానికి కొన్ని శాఖల కార్యదర్శులు గైర్హాజరుకావడంపై కూడా కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.