జాతీయ వార్తలు

కందుని గ్యాంగ్‌రేప్ కేసులో ముగ్గురికి మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 30: దాదాపు రెండున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందుని గ్యాంగ్ రేప్ కేసు నిందితుల్లో ముగ్గురికి మరణ శిక్ష, మరో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక అదనపు సెషన్స్ జడ్జి సంచితా సర్కార్ శనివారం తీర్పు చెప్పారు. అమీనుల్ అలీ, సైఫుల్ అలీ, అన్సార్ అలీలకు మరణ శిక్ష, ఇమానుల్ ఇస్లామ్, అమీనుల్ ఇస్లామ్, భోలా శంకర్‌లకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు జడ్జి తీర్పు చెప్పారు. కాగా, తగిన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా నిందితుల్లో మరో ఇద్దరిని జడ్జి గత బుధవారం నిర్దోషులుగా విడిచిపెట్టారు. మరో నిందితుడు గోపాల్ నస్కర్ విచారణ జరుగుతూ ఉండగానే గత ఏడాది ఆగస్టులో చనిపోయాడు. క్రిక్కిరిసిన కోర్టు రూమ్‌లో తీర్పు ప్రకటించే ముందు జడ్జి నిందితుల్లో ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి, వారిని బోనులో ప్రవేశపెట్టిన తర్వాత మరీ తీర్పు ప్రకటించారు. 2013 జూన్ 7న పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా కందుని గ్రామానికి చెందిన బిఏ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల యువతి కాలేజిలో పరీక్ష రాసి బస్సు దిగి ఇంటికి తిరిగి వస్తుండగా, కొంతమంది ఆమెను బలవంతంగా పొలాల్లోకి లాక్కువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశారు. ఆమె మృతదేహం ఆ మర్నాడు ఉదయం పొలంలో కనిపించింది. ఈ సంఘటన అప్పట్లో పెద్దఎత్తున ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆందోళనకారులు తన క్లయింట్ తరఫున వాదించడానికి అనుమతించడం లేదంటూ నిందితుల్లో ఒకరి తరఫు న్యాయవాది కోల్‌కతా హైకోర్టుకు వెళ్లడంతో బరసాత్ సెషన్స్ కోర్టునుంచి కేసు విచారణను సిటీ సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు కూడా. ఈ కేసులో విచారణ ఈ నెల 18న ముగిసింది.