జాతీయ వార్తలు

గాంధీజీ సిద్ధాంతం అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను కేంద్ర మంత్రి ఉమాభారతి పిచ్చివాడిగా అభివర్ణిస్తూ, గాంధీజీ సిద్ధాంతం శాశ్వతమైనదని అన్నారు. శనివారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆమె గంగానది శుద్ధిలో పాలుపంచుకోవాలని నది పరీవాహక ప్రాంతంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేయడమే కాక ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేలా వారిని ఒప్పించడానికి తాను పాదయాత్ర నిర్వహిస్తానని చెప్పారు. ‘ఈ రోజు మహాత్మాగాంధీ వర్ధంతి. అరవై ఎనిమిది ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఓ పిచ్చివాడు ఆయన జీవితాన్ని అంతమొందించాడు. గాంధీజీ ఇప్పుడు మన మధ్య జీవించిలేడు కానీ ఆయన సిద్ధాంతానికి మరణం లేదు’ అని ఉమాభారతి అన్నారు. ‘్భరతదేశానికి పట్టుగొమ్మలు గ్రామాలేనని గాంధీజీ చెప్పేవారు. గంగానదిని శుద్ధి చేయడంపై గ్రామ పెద్దలతో చర్చలు జరపడానికి ఈ రోజే చాలా మంచి రోజు’ అని గాడ్సే పేరును ప్రస్తావించకుండా అన్నారు.
గంగానది శుద్ధిపై జాతీయ స్థాయిలో సంప్రదింపుల కార్యక్రమమైన ’స్వచ్ఛగంగా-గ్రామీణ సహభాగిత’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఉమాభారతి తాను గాంధీజీ భక్తురాలినని చెప్పుకోవడమేకాక తన నేతృత్వంలోని గంగానది సుందరీకరణ మంత్రిత్వ శాఖ ఆయన చూపించిన మార్గంలోనే పని చేస్తోందని చెప్పారు. గంగానది శుద్ధికోసం గత 29 ఏళ్లలో 4వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. అయితే ‘నమామి గంగే’ కార్యక్రమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన 20వేల కోట్ల రూపాయలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే గంగానది ప్రపంచంలోని అత్యంత స్వచ్ఛమైన పది నదుల్లో ఒకటిగా ఉంటుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. గత 60-70 ఏళ్ల కాలంలో గంగానదిని దృష్టిలో పెట్టుకోకుండా నది పొడవునా పట్టణీకరణ చోటుచేసుకుందని ఉమాభారతి అన్నారు. గంగానదిని స్వచ్ఛంగా ఉంచేలా నది పొడవునా ఉండే గ్రామస్థులను ఒప్పించడానికి తాను పాదయాత్ర జరుపుతానని కూడా ఆమె చెప్పారు. గంగా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఆమె ఈ సందర్భంగా ప్రశంసించారు. గంగానది శుద్ధి కార్యక్రమంలో గ్రామస్థులను భాగస్వాముల్ని చేయడానికి చేపట్టిన తొలి ప్రయత్నంగా భావిస్తున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, బీరేంద్ర సింగ్, సర్బనంద సోనోవాల్, మహేశ్ శర్మ, సన్వర్‌లాల్ జాట్ కూడా పాల్గొన్నారు.

ఢిల్లీలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛగంగా-గ్రామీణ సహభాగిత’ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఉమాభారతి, నితిన్ గడ్కరీ తదితరులు