జాతీయ వార్తలు

జాతిపితకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా జాతియావత్తు ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద రాష్టప్రతి ప్రణబ్ ఉప రాష్టప్రతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తదితరులు ఆయనకు నివాళి అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్ముడికి నివాళి అర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు మహేశ్ శర్మ, బాబుల్ సుప్రియో, రావు ఇందర్ సింగ్, త్రివిధ దళాధిపతులు జాతిపితకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద దేశభక్తి గీతాలను ఆలపించారు. పెద్ద సంఖ్యలో బడి పిల్లలు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళి అర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ కె రోశయ్య, పలువురు రాష్టమ్రంత్రులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. శనివారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ప్రభృతులు అమరవీరులకు కూడా నివాళి అర్పించారు.

చిత్రం... జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం రాజ్‌ఘాట్‌కు తరలివస్తున్న రాష్టప్రతి ప్రణబ్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.