జాతీయ వార్తలు

‘మనసులో మాట’తో సమస్యలు పరిష్కారం కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 31: ప్రధాని నరేంద్ర మోదీ ‘మనసులోని మాట’పై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపించింది. ఈ కార్యక్రమంపై ప్రజలంతా విసిగిపోయారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలని, వాటిపై దృష్టి సారించాలని హితవు పలికింది. కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోని నిరుద్యోగ సమస్య, అశాంతి కేవలం ‘మనసులోని మాట’తో పరిష్కారం కావు. అలాగే మీరు చెప్పిన ‘అచ్చేదిన్’ (మంచి రోజులు) రావు. మీరు మంచి పనులు చేసినప్పుడు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. ఇప్పటివరకూ ప్రధాని నరేంద్ర మోదీ 16సార్లు ‘మనసులోని మాట’ కార్యక్రమంలో పలు అంశాలపై ప్రజలతో ఆలోచనలు పంచుకున్న విషయం తెలిసిందే. వాటిలో మాదక ద్రవ్యాలు, రైతుల సమస్యలు, అవినీతి, ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, రోడ్డు ప్రమాదాలు వంటి అంశాలున్నాయి. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంపై విమర్శలు ఎక్కుపెట్టింది. ‘మనసులోని మాట’ కేవలం ఒక ప్రచార కార్యక్రమమని, ప్రభుత్వ మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టింది.

ఢిల్లీలోని వేంకటేశ్వర
కళాశాలను అభివృద్ధి చేస్తాం
టిటిడి చైర్మన్ చదలవాడ
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జనవరి 31: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వేంకటేశ్వర కళాశాలను అభివృద్ధి చెయ్యడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణముర్తి అన్నారు. వేంకటేశ్వర కళాశాలను సందర్శించిన చదలవాడ ఆదివారం ఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడారు. కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులతో ముచ్చటించిన చదలవాడ అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న వేంకటేశ్వర కళాశాలలో ఇరవైకిపైగా కోర్సులలో నాలుగు వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని అన్నారు. వందమంది విద్యార్థులకు సరిపడేలా హాస్టల్ కూడా నిర్మిస్తామని అయిన తెలిపారు. టిటిడి ఉద్యోగుల పిల్లలకు మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. విఐపిలకు ప్రాధాన్యత తగ్గించి సామాన్యులకు స్వామివారి దర్శనభాగ్యం పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా భక్తుల కోరిక మేరకు అయిదు రోజులపాటు వేంకటేశ్వర వైభవోత్సవం నిర్వహిస్తామని అన్నారు. అమెరికాలో కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహించమని అక్కడి భక్తులు కోరుతున్నారని ఆయన తెలిపారు.