జాతీయ వార్తలు

పంటల బీమా ఓ కల్పతరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలోని యాభై శాతం మంది రైతులను ప్రధాన మంత్రి బీమా పథకంలో చేర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, దీన్ని సాకారం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంకుర పరిశ్రమలు కేవలం ఐటి సంస్థలకే కాదు ఇతర పరిశ్రమలకు కూడా వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. నరేంద్ర మోదీ ఆదివారం తన పదహారవ మనసులోని మాట ప్రసంగాన్ని ఆకాశవాణిలో చేస్తూ ఈ విషయాలు చెప్పారు. ప్రధాన మంత్రి పంటల బీమా పథకం రైతులకు కల్పతరువు లాంటిదని ఆయన చెప్పారు. కొత్త పంటల బీమా పథకం నియమ, నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశామని, సాంకేతిక పరిజ్ఞానానికి ఇందులో పెద్దపీట వేయటంతోపాటు చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని కూడా బాగా తగ్గించామని నరేంద్ర మోదీ తెలిపారు. రానున్న ఒకటి, రెండు సంవత్సరాల్లో దేశంలోని సగంమంది రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు. రైతులు పిఎం పంటల భీమా పథకంలో చేరితే అతివృష్టి, అనావృష్టి సమయంలో వారిని ఆదుకునేందుకు వీలు కలుగుతుందని మోదీ సూచించారు.
ఖాదీకి చేయూతనివ్వండి
ఖాదీ బట్టలకు ప్రాధాన్యత ఇవ్వాలి, తమకున్న బట్టల్లో ఒకటైనా ఖాదీది ఉండేలా చూసుకోవలని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఖాదీ పరిశ్రమను పటిష్టం చేయటం ద్వారా దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉన్నదని ప్రధాన మంత్రి వివరించారు. ఖాదీ బట్టలను ప్రోత్సహించాలని రైల్వే, హోం, పోలీసులు, భారత నావికాదళం, ఉత్తరాఖండ్ పోస్టల్ విభాగం, ఇతర శాఖలు నిర్ణయించాలని ఆయన తెలిపారు. స్వాతంత్ర పోరాటం ఖాదీతో ముడిపడి ఉన్నదన్నారు. భారతదేశం సభ్యత, సంస్కృతి, అహింసా ఉద్యమం కూడా ఖాదీతో ముడిపడి ఉన్నదని అన్నారు. రైతుల సంక్షేమం కూడా ఖాదీతో ముడిపడి ఉంది. యువతరం, నవతరం కూడా ఖాదీవైపు మొగ్గు చూపిస్తోందని మోదీ చెప్పారు. ఖాదీ ఫ్యాషన్ రంగంలో కూడాప్రభావాన్ని చూపించటం పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
స్టార్టప్‌లు అన్ని రంగాలకూ విస్తరించాలి
ఇటీవల ప్రారంభించిన అంకుర పరిశ్రమలు (స్టార్టప్) కేవలం ఐటి రంగానికి పరిమితం కాకుండా యువతకు ఇతర రంగాల్లో కూడా అవకాశాలను కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఐఐఎం నుండి పట్టాలు పుచ్చుకున్న కొందరు యువకులు సిక్కింలో ప్రారంభించిన అంకుర పరిశ్రమల గురించి మోదీ వివరించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇది అంతర్జాతీయ సైనిక శక్తులను భారతదేశంలో సమన్వయపరిచే ప్రక్రియ అని వివరించారు. అస్సాం రాజధాని గౌహాతిలో ఫిబ్రవరి ఐదోతేదీ నుండి దక్షిణాసియా క్రీడలు నిర్వహిస్తారని ఆయన ప్రకటించారు. ఈ క్రీడల ద్వారా సార్క్ దేశాల మధ్యనున్న స్నేహ, సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలు కలుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
వౌనంతోనే శక్తిని ప్రదర్శిద్దాం
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశంలోని ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది రెండు నిమిషాలపాటు వౌనం పాటించాలని మోదీ పిలుపు ఇచ్చారు. ఈ వౌనం ద్వారా మనశక్తిని ప్రదర్శించాలన్నారు. దేశంలోని మహానాయకుల విగ్రహాలను పరిశుభ్రం చేసుకోవటం మన బాధ్యత అని, విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ఎంతో ఉత్సాహాన్ని చూపించే మనం ఆ తరువాత దానిని మరిచిపోతున్నాం, విగ్రహం ఏ మేరకు శుభ్రంగా ఉన్నదనేది ఎవ్వరూ పట్టించుకోవటం లేదని మోదీ అన్నారు. ఇది మంచి విధానం కాదు, మహానాయకుల విగ్రహాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోటం ద్వారా వారిపట్ల మనకున్న గౌరవాన్ని చాటుకోవాలని మోదీ హితవు చెప్పారు. అధికారాల గురించి చర్చించే మనం కర్తవ్యాల గురించి ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రధాన మంత్రి ప్రశ్నించారు. అధికారాలకు ఇచ్చే ప్రాధాన్యతను కర్తవ్య నిర్వహణకు కూడా ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు.
స్వచ్ఛ-సుందర భారత్
స్వచ్చ భారత్‌కు సుందర భారత్ అంశాన్ని జోడించాలని మోదీ సూచించారు. స్వచ్చ భారత్ పథకం దేశంలోని ఏదో ఒకచోట శుభ్రంచేసే పని కొనసాగుతూనే ఉన్నదని, ఇప్పుడు దీనికి సుందర భారత్ కూడా తోడవుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. రైల్వే స్టేషన్లలో స్వచ్చతతోపాటు సుందరీకరణం కూడా జరగాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, కళాకారులు తమ రైల్వే స్టేషన్‌ను పరిశుభ్రం చేయటంతోపాటు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇది ఎంతో మంచి పరిణామమని నరేంద్ర మోదీ చెప్పారు. మహారాష్టల్రోని థానే జిల్లాలో దాదాపు మూడు వందల మంది వలంటీర్లు కింగ్ సర్కిల్ రైల్వే స్టేషన్‌ను పరిశుభ్రం చేయటంతోపాటు సుందరంగా తీర్చిదిద్దటాన్ని ఆయన ప్రశంసించారు.