జాతీయ వార్తలు

విహారయాత్రలో ఘోర విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 1: మహారాష్టల్రో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. పుణేలోని ఇనామ్‌దార్ కళాశాల నుంచి విహారయాత్రకు వచ్చిన 13 మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం రాయ్‌గఢ్ జిల్లాలోని మురద్-జంజీరా బీచ్‌లో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పది మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. ఇనామ్‌దార్ కళాశాల నుంచి దాదాపు 130 మంది విద్యార్థులు విహారయాత్ర కోసం మూడు బస్సుల్లో మురద్‌కు చేరుకున్నారని, వీరిలో 18 మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈతకు వెళ్లి సముద్రంలో మునిగిపోయారని, అయితే స్థానిక జాలర్లతో పాటు తీర రక్షక దళం సాయంతో ఐదుగురిని మాత్రమే రక్షించగలిగామని స్థానిక రెవెన్యూ అధికారి తెలిపారు. మృతులంతా 19 నుంచి 23 ఏళ్లలోపు వారేనని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, సముద్రంలో మునిగిపోయిన విద్యార్థులను రక్షించేందుకు తీర రక్షక దళం ‘చేతక్’ హెలికాప్టర్‌తో పాటు మరో విమానంతో గాలింపు జరిపిందని, అలాగే ‘సీ కింగ్’ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దింపామని సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
కాగా, ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఇనామ్‌దార్ కళాశాల ప్రిన్సిపాల్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. విహారయాత్రకు వెళ్లినవారంతా ఇనామ్‌దార్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న సీనియర్ విద్యార్థులని, ఐదుగురు అధ్యాపకులు, ఇతర సిబ్బందితో కలసి వారు కళాశాల ఆధ్వర్యంలో వార్షిక విహారయాత్రకు వెళ్లారని, ఇంతలోనే ఈ ఘోరం జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన విలేఖర్లతో అన్నారు.

చిత్రం... విద్యార్థులు గల్లంతైనచోట గాలింపు చర్యలు