జాతీయ వార్తలు

శశి థరూర్‌కు సత్యశోధన పరీక్షలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు సత్యశోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనకు ఈ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సునంద అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరు కావలసిందిగా శశి థరూర్‌ను పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత ఆయనకు సత్య శోధన పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో థరూర్ ఇంట్లో పనిమనిషి నారాయణ్ సింగ్‌ను, డ్రైవర్ బజ్‌రంగిని సిట్ గత గురువారం విచారించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని లోధి కాలనీలో గల కొందరు ఔషధ విక్రేతలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. సునంద మృతిచెంది ఉన్న హోటల్ గదిలో అల్‌ప్రాక్స్ టాబ్లెట్లను పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. సునందకు ఈ అల్‌ప్రాక్స్ టాబ్లెట్లు ఎక్కడినుంచి వచ్చాయనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఔషధ విక్రేతలను విచారిస్తున్నారు.