జాతీయ వార్తలు

పరస్పర సహకారంపై కుదిరిన అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక సహకారం, పర్యావరణ పరిరక్షణ అంశంపై ఆంధ్రప్రదేశ్, కెనడాలోని ఒంటారియో రాష్ట్రాల మధ్య ఎంఓ యు కుదిరింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్‌రావు, ఒంటారియో అంతర్జాతీయ వాణి జ్యం, పౌరసత్వ శాఖ మంత్రి మిఖాయిల్ ఛాన్ సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రెండు రాష్ట్రాల్లో వ్యాపార, వాణిజ్యాలు నెరపేందుకు గల అవకాశాలపై వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వటం, వ్యాపార సంబంధ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం తదితర అంశాలపై అవగాహన కుదిరింది. రెండు రాష్ట్రాలు వివిధ అంశాలపై ప్రతినిధులను పరస్పరం పంపించుకుంటాయి.
రెండు రాష్ట్రా లు కలిసి సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తాయి. వాణిజ్య పరమైన ప్రదర్శనల నిర్వహణ చేపడతారని కంభంపాటి విలేఖరులతో చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయల కల్పన, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవటం, వాహనల ఉత్పత్తి, వ్యవసాయ శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటంపై రెండు రాష్ట్రాలు పరస్పరం సహరించుకుంటాయని ఆయన వివరించారు.