జాతీయ వార్తలు

సీతను రాముడు అడవికి పంపితే ఎవరిని శిక్షించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఫిబ్రవరి 1: ప్రవాసం నిమిత్తం సీతాదేవిని శ్రీరామచంద్రుడు అడవికి పంపడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై బిహార్‌లోని ఒక న్యాయస్థానం సోమవారం విచారణ ప్రారంభించింది. రామాయణంలో చెబుతున్నట్లుగా సీతాదేవిని రాముడు అడవులకు పంపినందుకు ఎవరిని శిక్షించాలి? అని కోర్టు ఈ సందర్భంగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. ‘ఎప్పుడో పురాతన కాలంలో జరిగినట్లు చెబుతున్న ఈ సంఘటనపై ఎందుకు కేసు దాఖలు చేశారు? ఈ ఘటనకు సాక్షులెవరు? పైపెచ్చు సీతమ్మను రాముడు ఎప్పుడు అడవికి పంపాడన్న తేదీని కూడా మీరు ప్రస్తావించలేదు. ఏ ఆధారంతో మీరు ఈ ఫిర్యాదు దాఖలు చేశారు? అంటూ సదరు పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించిందని ఒక న్యాయవాది వెల్లడించారు. అయితే సీతాదేవికి న్యాయం చేయాలని కోరేందుకే తాను కోర్టును ఆశ్రయించానని పిటిషనర్ తెలిపాడు.