జాతీయ వార్తలు

కోటాకు దిగుల్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, ఫిబ్రవరి 2: దళితుల హక్కులను పూర్తి స్థాయిలో పరిరక్షిస్తామని, వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో శ్రీకారం చుట్టిన ప్రధాని ‘అంబేద్కర్ సాధించిన విజయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎన్‌డిఎ గట్టి ప్రయత్నాలు చేయడం ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుట్టించింది’అని అన్నారు. ‘అంబేద్కర్ పేరు ఉన్నంత వరకూ దళితుల అభివృద్ధి ఆగకూడదు..దళితులకు కల్పిస్తున్న రిజర్వేషన్లూ కొనసాగుతాయి’అని మోదీ ఈ సందర్భంగా అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండు రోజులనూ అంబేద్కర్ సంస్మరణకు అంకితం చేయడం, లండన్‌లోని ఆయన ఇంటిని ప్రభుత్వం చేపట్టడం వంటి చర్యలు విపక్షాల్లో కలవరం రేపాయన తెలిపారు. ఇప్పటి వరకూ దళిత ప్రజలను తమ ఓటు బ్యాంకుగా ఈ పార్టీలు భావించడమే ఇందుకు కారణమని తెలిపారు. దళితులపై జరిగిన ప్రతి దాడికీ ప్రభుత్వానే్న తప్పుబట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్, అలాగే రేటింగ్ ఏజెన్సీలు పేర్కొనడాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉంటే అది భారత దేశమేనని ఈ సంస్థలు స్పష్టం చేశాయన్నారు. రెండేళ్ల క్రితం నాటి పరిస్థితికి నేటి దేశ స్థితిగతులకు మధ్య ఉన్న తేడా చాలా స్పష్టమని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వం కుంభకోణాలతో తలమునకలైందని, ఏడాదిన్నర ఎన్డీయే పాలనలో ప్రజల్లో నమ్మకం, ఆశలు పెరిగాయని తెలిపారు.

చిత్రం... కోయంబత్తూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని శాలువాతో సత్కరిస్తున్న తమిళనాడు బిజెపి నేతలు