జాతీయ వార్తలు

అనుపమ్‌కు వీసా ఇవ్వని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కరాచీలో శుక్రవారం ప్రారంభమయ్యే ఓ సాహితీ సదస్సులో పాల్గొనడానికి బాలీవుడ్ నటుడు, బిజెపి సానుభూతిపరుడు అనుపమ్ ఖేర్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం వీసా నిరాకరించింది. అయితే అనుపమ్ ఖేర్ వీసాకోసం అసలు దరఖాస్తే చేయలేదని న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయం చెప్పడం గమనార్హం. నాలుగు రోజుల పాటు జరిగే ప్రతిష్ఠాత్మక కరాచీ సాహితీ సదస్సు కోసం నిర్వాహకులు భారత్‌నుంచి ఆహ్వానించిన 18 మందిలో ఖేర్ ఒకరు. అయితే ఆయన ఒక్కరికే పాక్ ప్రభుత్వం వీసా నిరాకరించడం విశేషం. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ వీసాలు మంజూరు చేసిన మిగతా 17 మందిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, సినీ నటి నందితాదాస్ తదితరులున్నారు. కాగా, తనకు వీసా మంజూరు చేయకపోవడం చాలా బాధ, నిరాశ కలిగించిందని ఖేర్ అంటూ, కాశ్మీరీ పండిట్ల సమస్యను లేవనెత్తినందుకు, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చినందుకు, దేశ భక్తుడిగా ఉన్నందుకు తనకు వీసా ఇవ్వలేదేమోనని అన్నారు. ‘చాలామందికి వీసాలు ఇచ్చి నాకు మాత్రం వీసా నిరాకరించడం ఎంతో బాధ, నిరాశ కలిగించింది. పాక్ కళాకారులను భారత్‌లో మనం స్వాగతిస్తాం. వారి ప్రదర్శనపై ఏదయినా ఒక చోట అభ్యంతరాలున్నా మిగతా చోట్ల వారిని స్వాగతిస్తాం. అయితే పాక్ మాత్రం ఆ విధంగా ప్రవర్తించడం లేదు’ అని ఖేర్ పిటిఐతో అన్నారు. కాగా, ఈ విషయమై ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌ను సంప్రదించగా, ఖేర్ హైకమిషన్‌కు అసలు వీసాకోసం దరఖాస్తే సమర్పించలేదని హైకమిషన్ మీడియా చీఫ్ మంజూర్ మెమన్ చెప్పారు. అందువల్ల ఆయనకు వీసా మంజూరు చేయడం, లేదా తిరస్కరించడం అన్న ప్రశే్న ఉత్పన్నం కాదని ఆయన అన్నారు.
కాగా, ఖేర్‌కు వీసా మంజూరు చేయకపోవడానికి కారణాలేమిటో తమకు తెలియదని కరాచీ లిటరేచర్ ఫెస్టివల్ నిర్వాహకులు అంటున్నారు. ఖేర్‌కు వీసా జారీ చేయమని, అందువల్ల ఆయనను వీసా కోసం దరఖాస్తు చేయవద్దని చెప్పమని న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ తమకు సలహా ఇచ్చిందని సదస్సు ప్రతినిధి అమీనా సరుూద్ చెప్పారు. భారత్‌నుంచి ఆహ్వానిస్తున్న మిగతా 17 మందిని వీసా దరఖాస్తులు సమర్పించమని చెప్పమని కూడా వారు తమకు చెప్పినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది కూడా ఒక పాకిస్తానీ స్వచ్ఛంద సంస్థ ఆహ్వానంపై లాహోర్ వెళ్లడానికి ఖేర్‌కు పాక్ వీసా ఇవ్వలేదు. భద్రతా కారణాల దృష్ట్యా వీసా ఇవ్వడం లేదని అప్పట్లో పాక్ ప్రభుత్వం తెలియజేసింది. కాగా, తాను వీసాకోసం అసలు దరఖాస్తే చేయలేదన్న పాక్ హైకమిషన్ వాదనను ఖేర్ ఖండిస్తూ, కమిషన్ వివరణ హాస్యాస్పదమన్నారు. అంతేకాదు, తన వీసా కోసం నిర్వాహకులు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసినట్లు చెప్పారు. ‘బహుశా నేను దేశ భక్తుడ్ని అయినందుకో లేదా నా దేశం గురించి మాట్లాడుతాననో నాకు వీసా నిరాకరించారేమో’నని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.