జాతీయ వార్తలు

ఆయుర్వేదంలో మనమే ఆద్యులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజీకోడ్, ఫిబ్రవరి 2: ఆయుర్వేదం వంటి భారతీయ సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రజలకు నాణ్యమైన, సరసమైన వైద్యం అందించడంతో ప్రపంచంలోనే భారత్ ముందుందని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఐదు రోజులు పాటు ఇక్కడ జరిగే ప్రపంచ ఆయుర్వేద ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న మార్పులు, విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను ఆకళింపుచేసుకోవాలని పిలుపునిచ్చారు. శాస్ర్తియంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయుర్వేద వైద్యాన్ని అభివృద్ధి చేసుకుంటే, అనేక వ్యాధుల తగ్గింపునకు పరిష్కారం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆయుర్వేద వైద్యంలో భారత్ ముందుందని, సంప్రదాయ వైద్యం ప్రజలకు మరింత చౌకగా అందించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని వెల్లడించారు. ‘ఆయుర్వేదం సహా భారతీయ సంప్రదాయ వైద్యం మరింత అభివృద్ధి చేస్తాం. ప్రజారోగ్య విధానం ద్వారా పరిశోధనలు, అలాగే నాణ్యమైన ఔషధాలు అందించడానికి కేంద్రం కృషి చేస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఆయుష్‌ను సమర్థవంతగా అమలుచేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఆయుష్ జాతీయ మిషన్ సమర్థవంతంగా పనిచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయుర్వేదం ఔషధం ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయుర్వేదిక్ దినచర్య మనిషిలో ఏకాగ్రత, ప్రశాంతతను పెంచుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఆయుర్వేదం వల్ల మనిషిని మానసికంగా, శారీరంగా ధృఢంగా ఉండేందుకు దోహదపడుతుందని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలు వైద్య రంగంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.

కోజికోడ్‌లో మంగళవారం అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న నిర్వాహకులు.