జాతీయ వార్తలు

వైరస్ ప్రాంతాలకు వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రపంచ దేశాలను మరో వైరస్ గడగడలాడిస్తోంది. దోమకాటు కారణంగా వ్యాపించే జికా వైరస్ దాదాపు అన్ని దేశాల్లోనూ హాహాకారాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్డ్ ఎమర్జెన్సీని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జికా వైరస్ కారణంగా తలెత్తే వ్యాధులను ఏ విధంగా అరికట్టాలనే దానిపై మంగళవారం స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. ముఖ్యంగా ఈ వైరస్ ఉన్న ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదంటూ పర్యాటకపరమైన ఆంక్షలు విధించింది. ఒకవేళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్లే ఆలోచన ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా గర్భిణులు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడమో లేక రద్దు చేసుకోవడమో చేయాలని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, రేవుల్లో ఈ వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వైరస్ వ్యాపించిన దేశాల నుంచి వ్యక్తులు ఏమాత్రం తమ ఆరోగ్యంలో తేడా వచ్చినా వెంటనే కస్టమ్స్ విభాగాన్ని సంప్రదించాలని కోరింది. ఆడీస్ ఆజిప్టి అనే దోమకాటు కారణంగా వ్యాపించే ఈ వైరస్ వల్ల జన్మతహా పిల్లలకు అనేక లోపాలు తలెత్తుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇప్పటివరకూ భారతదేశంలో ఈ వైరస్ జాడ లేకపోయినా, దీనివల్లే తలెత్తే డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉందని తెలిపింది. భారత్‌లోకి ఎవరి కారణంగానూ జికా వైరస్ రాకుండా విస్తృత స్థాయిలో నివారణ, నిరోధక చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ఆదేశించినట్లు ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా తెలిపారు. ఈ వైరస్‌కు సంబంధించిన మొత్తం పరిస్థితిని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్), సాధారణ ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్‌లకు చెందిన సంయుక్త బృందం పర్యవేక్షిస్తుందని నడ్డా వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతోపాటు తక్షణమే అవసరమైన చర్యలను కూడా ఈ బృందం సూచిస్తుందని, పరిస్థితి తీవ్రతను బట్టి తక్షణ ప్రతిస్పందన బృందాలను (ఆర్‌ఆర్‌పి)లను కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర స్థాయిలోనే ఏర్పాటుచేస్తామని నడ్డా తెలిపారు. ఈ బృందాల్లో ప్రజారోగ్య నిపుణులు, సూక్ష్మ జీవులకు సంబంధించిన నిపుణులు, అలాగే ఒక వైద్య నిపుణుడు ఉంటారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.