జాతీయ వార్తలు

ఉపాధి హామీలో తెలుగు రాష్ట్రాలకు 10 అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి,2: జాతియ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలుగురాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో తెలంగాణా ఐదు, ఆంధ్రప్రదేశ్ ఐదు అవార్డులు దక్కించుకున్నాయి.
కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పదవ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖలు ప్రత్యేక కార్యక్రమాన్ని ఎర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నలభైకి పైగా అవార్డులను ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పంచాయతిరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఈ అవార్డులను విజేతలకు అందచేశారు. తెలంగాణకు అయిదు అవార్డులు లభించగా ఇందులో దేశంలోనే పారదర్శకత, జవాబుదారీ విభాగంలో నిజామాబాద్ జిల్లాకు అవార్డు లభించగా ఆ జిల్లా కలెక్టర్ యోగితా రాణా కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చేతుల మీదుగా దానిని అందుకున్నారు. వివిధ విభాగాలలో మరో రెండు అవార్డులు, అలాగే వ్యక్తిగత విభాగంలో రెండు అవార్డులు తెలంగాణకు లభించాయి. ఉపాధి హామీ పథకాన్ని సమర్దవంతంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూడా అయిదు అవార్డులు సాధించుకోగా పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో కడప జిల్లాకు అవార్డు రాగా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
chitram...
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా ఉపాధి హామీ అవార్డు అందుకుంటున్న ఎపి పంచాయతీ రాజ్, ఆర్‌అండ్ బి కమిషనర్ బి రామాంజనేయులు