జాతీయ వార్తలు

మిషన్ భగీరథ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మిషన్ భగీరథ తొలి ఫలితాలు తొమ్మిది నియోజకవర్గాల్లో మేలో కనిపిస్తాయని గ్రామీణాభివృద్ది, ఐటి మంత్రి కెటి రామారావు వెల్లడించారు. బుధవారం విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చ్భారత్, జాతీయ గ్రామీణ తాగునీటిపై ఏర్పాటు చేసిన సదస్సుకు కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మిషన్ భగీరథను 2018నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రతిష్మాత్మక పథకాన్ని పలు రాష్ట్రాల ప్రతినిధులు పరిశీలించి, ఆయా రాష్ట్రాల్లో అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. 40వేల కోట్లు వెచ్చించి మూడేళ్లలో పూర్తి చేయనున్న మిషన్ భగీరథపై సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. నిధుల సమీకరణ, చట్టాల రూపకల్పన, ప్రజలను సమాయత్తం చేయటం, అధికార యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న అంశాలను అందులో వివరించామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో గడువుకంటే ముందే పనులు పూర్తి చేస్తూ కేంద్ర మంత్రి చేతులమీదుగా సర్ట్ఫికెట్ అందుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ ద్వారా ఇస్తామన్న వెయ్యి కోట్లు ఏమాత్రం సరిపోవన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు.
కాంగ్రెస్ రెచ్చగొడుతోంది
పాతబస్తీ ప్రజలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కెటిఆర్ దుయ్యబట్టారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో తలెత్తిన ఘర్షణలపై స్పందిస్తూ ఎన్నికల్లో స్వల్ప వివాదాలు సహజమే అయినా, అన్ని పార్టీల నేతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యవహరించటం మంచిది కాదన్నారు. మరింత ఉద్రిక్త వాతావరణం సృష్టించేలా బుధవారం సైతం కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించటం మంచిది కాదన్నారు. పాతబస్తీ ఉద్రిక్త ప్రాంతం. అక్కడేం జరిగినా ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది కనుక, నాయకులు సంయమనం పాటించాలన్నారు. పాతబస్తీలో కేవలం కాంగ్రెస్‌పైనే కాదు, తెరాస ఉప ముఖ్యమంత్రిపైనా దాడి జరిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. తెరాస నేతలపైనా పోలీస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరెస్టులకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్న అంశాన్ని ప్రస్తావించినపుడు, మీరో నేనో డిమాండ్ చేయటం కాదు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరిని అరెస్టు చేయాలనేది మనం నిర్ణయించలేం. ఆ బాధ్యత నిర్వహించేందుకు పోలీసు శాఖ ఉందికదా అని రామారావు వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని తమకు తెలుసంటూనే, ఆ ధైర్యంతోనే ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించానని గుర్తు చేశారు.
కేంద్రమంత్రి ప్రశంసలు
మిషన్ భగీరథపై రామారావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. మామూలుగా అయితే అధికారులు ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటారు. కానీ తెలంగాణకు చెందిన మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం బాగుందన్నారు. మామూలుగా అధికారులు ప్రజెంటేషన్ ఇస్తుంటే మంత్రులు చూస్తుంటారు. కానీ మంత్రే ప్రజెంటేషన్ ఇస్తుంటే అధికారులు చూస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలూ అమలు చేయాలని మంత్రి బీరేంద్ర సింగ్ సూచించారు.

చిత్రం... గడువుకు ముందే తాగునీటి పనులు పూర్తి చేస్తున్నందుకు
కేంద్ర మంత్రి నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న మంత్రి కెటిఆర్