జాతీయ వార్తలు

ప్రజాసేవకే సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: పర్యావరణానికి హాని కలిగించని సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని, ఈ ఆవిష్కరణలు ఎటువంటి దుష్ప్రభావం చూపనివిగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఒడిశా రాజధాని భువనే్వర్ సమీపంలోని జత్ని వద్ద ఆదివారం ఆయన ఎన్‌ఐఎస్‌ఇఆర్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, పరిశోధనలు చేస్తున్న వారంతా నోబెల్ పురస్కారాన్ని పొందకపోచ్చని, అయితే సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడమే వారికి నిజమైన పురస్కారమని స్పష్టం చేశారు. దేశ సాంప్రదాయ విజ్ఞానం గురించి మోదీ మాట్లాడుతూ, గ్రంథాల నుంచి విజ్ఞానాన్ని ఆర్జించిన డాక్టర్ మంజుల్ భార్గవ ఎంతో గొప్ప గణితవేత్తల్లో ఒకరిగా ఆవిర్భవించారని, ఆయన తండ్రి సంస్కృత పండితుడని కొనియాడారు. మన సాంప్రదాయ విజ్ఞానాన్ని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ‘ప్రజలపై, పర్యావరణంపై ఎటువంటి దుష్ప్రభావం చూపని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే మన ప్రాధాన్యత కావాలి’ అని మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలో బొగ్గు గనులు తరిగిపోయాయని, కనుక చౌకగా అందుబాటులోకి వచ్చే హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని (గ్రీన్ టెక్నాలజీని) అభివృద్ధి చేయడం ద్వారా మళ్లీ బొగ్గు నిల్వలు అభివృద్ధి చెందేందుకు వీలు కల్పించాలని ఆయన అన్నారు. అంతరిక్షం, సాగరాల నుంచి మనం ఇప్పటికీ సరైన ప్రయోజనాలను పొందలేదని, అక్కడ వనరులను అనే్వషించి వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. సంపద ఉండబట్టే సముద్రాన్ని మన పూర్వీకులు ‘రత్నగర్భ’గా అభివర్ణించారని, కనుక సాగరాల్లో పరిశోధనలు సాగించాలని ఆయన శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. అంగారక గ్రహ యాత్ర (మార్స్ మిషన్) ద్వారా ఖగోళ పరిశోధనల్లో భారత్ ఇప్పటికే తన ఉనికిని చాటుకుందన్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై మన శాస్తవ్రేత్తలు పరిశోధనలు మొదలు పెట్టినప్పుడు వారికి సరైన తోడ్పాటు లేదని, అయినప్పటికీ వారు ఎన్నో విజయాలు సాధించారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి ప్రధాని ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తూ, చౌకగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని శాస్తవ్రేత్తలు సవాలుగా స్వీకరించాలని, పేద ప్రజలకు సైతం ఉపయోగపడేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ఎస్‌సి.జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు జువల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.

చిత్రం... ఒడిశా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి భువనేశ్వర్ విమానాశ్రయంలో
స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్