జాతీయ వార్తలు

దేశంలో ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఎన్నారైలు స్వదేశంలో ఎక్కడైనా ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చని జాతీయ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. జస్టిస్ జెఎం మాలిక్ నేతృత్వంలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌డిఆర్‌సి) ఆదేశించింది. గృహ నిర్మాణం కోసం ఎన్నారై చెల్లించిన 64 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని సూపర్‌టెక్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థకు విజ్ఞప్తి చేసింది. దక్షిణ ఢిల్లీకి చెందిన రెష్మా భగత్ ఆమె కుమారుడు తరుణ్ భగత్ గ్రేటర్ నోయిడాలో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. దీనికి సంబంధించి 2008లో సూపర్‌టెక్ అనే నిర్మాణ సంస్థకు 63,99,727 రూపాయలు చెల్లించారు. సొమ్ములు మొత్తం చెల్లించినా నిర్మాణం పూర్తిచేయడం లేదా ఫ్లాట్ అప్పగించడం జరగలేదని భగత్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. నిర్మాణ సంస్థ మాత్రం తన చర్యను సమర్ధించుకుంది. తరుణ్ పేరుతో ఫ్లాట్ బుక్ చేసినమాట వాస్తవమేనని, అయితే వారు నివాసం ఉండడానికి కాకుండా లాభాపేక్ష ఉందని పేర్కొంది. ఎన్నారై కాబట్టి అతడు ‘వినియోగదారు’ కిందకు రాడని సూపర్‌టెక్ వాదించింది. దీన్ని కమిషన్ తోసిపుచ్చింది. విదేశాల్లోని ఎన్నారైలు సొంత ఊరులో నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. భగత్ బుక్ చేసుకున్న ఫ్లాట్ కాకుండా మరోచోట ఇవ్వజూపడం సరైందికాదన్నారు. ఈ విషయంలో వారిని ఎవరూ బలవంతం చేయలేరని కూడా కమిషన్ తెలిపింది.