జాతీయ వార్తలు

హిందీ సినీ గీత రచయిత ఫజ్లీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: ప్రముఖ కవి, హిందీ సినీ గీత రచయిత నిడా ఫజ్లి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఫజ్లీకి భార్య, కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో జన్మించిన ఫజ్లీ గ్వాలియర్‌లో విద్యాభ్యాసం చేశారు. దేశ విభజన సమయంలో తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో స్ధిరపడాలని నిర్ణయించుకోగా, ఫజ్లీ వారితో విభేదించి భారత్‌లోనే ఉండిపోయారు. తండ్రి బాటలో నడిచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. హిందీ సినిమాల్లోకి ప్రవేశించి, గజల్ రచయితగా అనేక అద్భుతమైన గీతాలు రాశారు. హిందీ సినిమాల్లో జగ్‌జీత్‌సింగ్, భూపేంద్ర వంటి గజల్ గాయకుల గళం నుంచి జాలు వారిన అనేక పాటలు ఫజ్లీ రాసినవే. ‘అహిస్తా అహిస్తా’లో ఆయన రాసిన ‘కభీ కిసీ కో ముకమ్మల్ జహా నహీ మిల్తా’ పాట ఆయన రాసిన ఎవర్‌గ్రీన్ హిట్‌సాంగ్స్‌లో ఒకటి. ‘ఆప్‌తో ఐసే న థె’లో ఫజ్లీ రాసిన ‘తూ ఇస్ తరహ్ సె మెరీ జిందగీ మె’ పాట ఇప్పటికీ అభిమానుల నాలుకలపై ఆడుతూనే ఉంటుంది. ‘ఆ భి జా, ఆ భి జా’ (సుర్), ‘హోష్‌వాలో కో ఖబర్ క్యా’ (సర్ఫరోష్), ‘హై గంగామయ్యా తూ జానా హమే నహీ రె’ (బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై), ‘జబ్ సె కరీబ్ హో కె చలె’ (లీలా) వంటి సూపర్‌హిట్ గీతాలు ఆయన కలం నుంచి జాలు వారినవే. సినీ పాటల రచయితగానే కాకుండా హిందీ, ఉర్దూ సాహిత్యానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఫజ్లీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత కూడా.