జాతీయ వార్తలు

మీతోనే గ్రామాలకు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఫిబ్రవరి 8: గ్రామీణ ప్రాంతాల స్థితిగతుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి గ్రామీణాభివృద్ధి (పిఎంఆర్‌డి) పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తున్న 230 మంది యువతతో సోమవారం మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కుటుంబ సంబంధమైన ఒత్తిడులు, ఇతర సాదకబాధకాలను పట్టించుకోకుండా ఈ పథకం కింద దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో అంకిత భావంతో పనిచేస్తున్న యువతీ, యువకులను మోదీ అభినందించారు. పిఎంఆర్‌డిఎఫ్ (ప్రైమినిస్టర్స్ రూరల్ డెవలప్‌మెంట్ ఫెలోస్) పథకాన్ని మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రధాని కోరారని సోమవారం న్యూఢిల్లీలో విడుదలైన అధికారిక ప్రకటన పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములుగా ఉండాలన్నది నేడు పిఎంఆర్‌డి ఫెలోస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వారిచ్చిన ప్రజెంటేషన్ల ఉమ్మడి సారాంశమని, కనుక గ్రామసీమల అభ్యున్నతికి ఇది ఎంతో ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు.
పిఎంఆర్‌డి పథకం కింద మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలతోపాటు నక్సల్ పీడిత ప్రాంతాల అభ్యున్నతికి తాము చేస్తున్న కృషిని, అలాగే మహిళా సాధికారత కోసం, మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ, విద్య, పౌష్ఠికాహార, జీవనోపాధి సమస్యల పరిష్కారానికి, పరిసరాల పరిశుభ్రత, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గురించి ఈ సందర్భంగా 11 మంది యువతీ, యువకులు మోదీకి సంక్షిప్తంగా వివరించారు. అనంతరం జరిగిన చర్చా గోష్ఠిలో వారు మాట్లాడుతూ, ఈశాన్య భారతావనితోపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి, సేంద్రియ వ్యవసాయం, వికలాంగుల సంక్షేమం తదితర అంశాలపై ప్రధానితో అభిప్రాయాలను పంచుకున్నారు. పేదరికాన్ని నిర్మూలించి, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పిఎంఆర్‌డిఎఫ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 2011 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించగా, 2012 ఏప్రిల్‌లో మొదటి బ్యాచ్ ఫెలోలను చేర్చుకున్నారు. రెండేళ్ల ఫెలోషిప్‌లో కేంద్ర నుంచి అదనపు సాయాన్ని పొందుతున్న జిల్లాల కలెక్టర్లతో కలసి పనిచేసి ప్రజల అవసరాలకు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషిచేసిన వీరు ఫెలోషిప్ పూర్తయిన తర్వాత వారికి కేటాయించిన రాష్ట్రంలో ఏడాదిపాటు ప్రజలకు సేవలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు వైజ్ఞానిక భాగస్వామి (నాలెడ్జ్ పార్టనర్)గా వ్యవహరిస్తున్న టిఐఎస్‌ఎస్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్) పిఎంఆర్‌డి ఫెలోల ఎంపిక, నియామకం, శిక్షణ, వారి పనితీరు తదితర అంశాలను పర్యవేక్షిస్తోంది.

చిత్రం... పిఎంఆర్‌డి కార్యక్రమాలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు బీరేందర్ సింగ్, సుదర్శన్ భగత్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.కె.మహాపాత్ర.