జాతీయ వార్తలు

పేద జిల్లాలకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 700 కోట్లు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 778 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అలాగే, ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని మూడు నుంచి మూడున్నర శాతానికి పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారన్నారు. మంగళవారం సాయంత్రం అరుణ్ జైట్లీతో సమావేశమైన ఈటల, రాష్ట్ర ఆర్థికాంశాలపై కూలంకషంగా చర్చించారు. రాజేందర్ వెంట ఎంపీలు బి వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డి ఉన్నారు. జైట్లీ 2016 వార్షిక ప్రణాళిక రూపొందించే ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. జైట్లీతో సమావేశం అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ హెచ్‌ఎండిఏను వ్యాపార సంస్థగా గుర్తించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను జైట్లీ అంగీకరించారన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రంకనుక ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచాలని గతంలో సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రిని కోరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణకు సంబంధించిన ఐదు డిమాండ్లను అరుణ్ జైట్లీ ముందు ప్రతిపాదించాం. ఇందులో నాలుగింటిని దాదాపుగా ఆమోదించారని రాజేందర్ చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందంటూ, ఈ నిధులను తెలంగాణకు వెంటనే విడుదల చేయాలని రాజేందర్ కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, పొందుపర్చిన అంశాలను పూర్తి చేయాలని జైట్లీని కోరామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆంధ్రకు ప్రత్యేకంగా నిధులిచ్చినట్టే తెలంగాణకూ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా పన్ను రాయితీలు ఇవ్వాలన్నారు. తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మూడు నుంచి మూడున్నర శాతానికి సడలించాలన్న ప్రతిపాదన మేరకు కేబినెట్‌లో చర్చించి ఆమోదిస్తామని జైట్లీ హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సరిపడా బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర పౌరసరఫరాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను కోరినట్టు చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు దాదాపు తొమ్మిది వేల టన్నుల బియ్యం అవసరముంటే, ప్రస్తుతం కేవలం మూడు వేల టన్నులు మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. మిగతా ఆరు వేల టన్నుల బియ్యం సైతం ఇవ్వాలని పాశ్వాన్‌ను కోరినట్టు ఈటల వివరించారు.