జాతీయ వార్తలు

‘లోక్‌పాల్’ను అడ్డుకుంటే మళ్లీ రంగంలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాలెగావ్ సిద్ధి, డిసెంబర్ 1: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టిన జన లోక్‌పాల్ బిల్లుకు కేంద్రం గనుక అడ్డంకులు సృష్టించినట్లయితే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనలోక్‌పాల్ బిల్లులోని ముఖ్యాంశాలను వివరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుమార్ బిశ్వాస్, సంజయ్ సింగ్ మంగళవారం అన్నాహజారేను మహారాష్టల్రోని ఆయన స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధిలో కలిసిన తర్వాత హజారే విలేఖరులతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగే అవినీతిపై దర్యాప్తు జరపడానికి వీలు కల్పిస్తున్న బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించవచ్చన్న భయాలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో చర్చల సందర్భంగా తాను వ్యక్తం చేసినట్లు అన్నా హజారే చెప్పారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని వర్గం ఆలోచనను వ్యతిరేకించిన అన్నా హజారే 2012లో వారితో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి అవినీతిపై ఉద్యమం చేపట్టడానికి వాళ్లిద్దరూ చేరువైనారు. జన లోక్‌పాల్ బిల్లును తీసుకువస్తామన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి. 2011లో ఉద్యమం సందర్భంగా రూపొందించిన జన లోక్‌పాల్ ముసాయిదా బిల్లుకు దీనికి ఏమీ తేడా లేదని ఆమ్ ఆద్మీ వాదిస్తోంది. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ అది చట్టంగా మారాలంటే లెఫ్టెనెంట్ గవర్నర్ దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.