జాతీయ వార్తలు

జవానూ.. జీవించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/జమ్ము: సియాచిన్ మంచు పర్వతాలలో పైన టన్నుల కొద్ది మంచుగడ్డలు కప్పివేయగా 25 అడుగుల లోతున ఆరు రోజుల పాటు కూరుకుపోయి ఉన్నప్పటికీ ఆర్మీ సహాయక బృందాలు వెలికితీసేంత వరకు ప్రాణాలను నిలుపుకున్న ధీరోదాత్తుడు, దృఢచిత్తుడు, దేహదారుఢ్యుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే అత్యంత భయానక పరిస్థితులనుంచి ప్రాణాలతో బయటికి రావడం అద్భుతమే.. అయితే సహాయక బృందాలు వెలికితీసేంత వరకు సజీవంగా ఉండగలగడంలో హనుమంతప్ప ప్రదర్శించిన అచంచల ఆత్మవిశ్వాసం, మానసిక స్థయిర్యం, దేశంకోసం నిలబడాలనే గట్టి నిబద్ధత, అందుకోసం కఠోర శ్రమతో నిర్మించుకున్న దేహదారుఢ్యం వంటివి ఈ అద్భుతంలో మిళితమై ఉన్నాయి. అందుకే దేశం యావత్తూ ఆయన వెంట నిలిచింది. దేశ ప్రథమ పౌరుడు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో దేశ ప్రజలు హనుమంతప్ప కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. దేశ రక్షణకోసం దృఢచిత్తంతో నిలబడిన వీర సైనికుడి ప్రాణాలను కాపాడడానికి తమ ఏ అవయవాన్ని అయినా ఇస్తామని ముందుకొస్తున్నారు. అయితే మంచుదిబ్బల్లో నుంచి బయటపడినప్పుడు స్పృహలోనే ఉన్న హనుమంతప్ప ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోయారు. హనుమంతప్ప ఆరోగ్యం ఇంకా తీవ్ర విషమంగానే ఉందని, మరో 24 గంటలు ఎంతో కీలకమని సోమవారం నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి మంగళవారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో ప్రకటించింది. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి హనుమంతప్ప వెంటిలేటర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నారు. ఆయన ప్రాణాలను కాపాడడానికి ఎంతోమంది నిపుణులయిన వైద్యులు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి అనుక్షణం ప్రయత్నిస్తున్నారని బులెటిన్ తెలిపింది. ఇన్‌టెన్సివిస్టులు, న్యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, ఎండోక్రినాలజిస్టు, సర్జన్లు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యాంటీ బయాటిక్స్‌తో పాటు రక్తపోటును పెంచడానికి ఫ్లూయిడ్లను, ఔషధాలను ఇస్తున్నారు.
హనుమంతప్ప కోలుకోవాలని ప్రార్థించడమే కాదు ఆయనను రక్షించడానికి చేతల్లో ముందుకొస్తున్నారు ప్రజలు. కాలేయం, కిడ్నీ సరిగా పనిచేయక బాధపడుతున్న హనుమంతప్పను కాపాడడానికి తన కిడ్నీని ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిధి పాండే అనే గృహిణి ముందుకొచ్చింది. లక్నోకు 167 కిలోమీటర్ల దూరంలో ఉన్న లఖింపూర్ ఖేరి అనే గ్రామానికి చెందిన నిధి పాండే తాను కిడ్నీ ఇవ్వడానికి హనుమంతప్ప చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులను ఎలా సంప్రదించాలని స్థానిక న్యూస్ చానల్‌ను వాకబు చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న రిటైర్డ్ సిఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ స్వరూప్ కూడా హనుమంతప్పకు తాను కిడ్నీ ఇస్తానని ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రికి వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆసుపత్రికి చేరుకొని హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తదితరులు హనుమంతప్ప వేగంగా కోలుకోవాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. ముంబయిలోని డబ్బావాలాలు కూడా ప్రార్థనలు జరిపారు.
chitram...
హనుమంతప్ప కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ముంబయ డబ్బావాలాలు. అహ్మదాబాద్‌లోని ఒక దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం