జాతీయ వార్తలు

‘సియాచిన్’ను పరిష్కరించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సియాచిన్‌పై ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని శాంతియుత రీతిలో పరిష్కరించుకోవాలంటూ పాకిస్తాన్ ముందుకొచ్చింది. మంచులోతుల్లో కూరుకుపోయి గురువారం జవాన్ హనుమంతప్ప మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేసింది. ఇరుదేశాలకు చెందిన సైనికులు హిమపాతానికి మరణించకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ‘సియాచిన్ సమస్య పరిష్కరించుకునే సమయం ఆసన్నమైంది. దీనిపై ఇరుదేశాలు దృష్టిపెట్టాలి’ అని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. ఈ సమస్య పరిష్కారం విషయంలో రెండు దేశాలూ చర్యలు తీసుకుంటే తదుపరి సైనిక మరణాలను నివారించే అవకాశం ఉంటుందని చెప్పారు. సియాచిన్ హిమప్రాంతంలో ఏమాత్రం మనుగడ సాధించలేని పూర్తిస్థాయి ప్రతికూల వాతావరణం ఉంటుందని అక్కడ ఏ దేశానికి సంబంధించిన సైనికులు పనిచేయాలన్నా, రక్షణ విధులు నిర్వహించాలన్నా కష్టమేనని బాసిత్ వివరించారు.

సియాచిన్ మంచుతుపానులో కూరుకుపోయన వారికోసం గాలిస్తున్న సైనికులు (ఫైల్ ఫొటో)