జాతీయ వార్తలు

ఫ్రీబేసిక్స్ వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత దేశంలో ఇంటర్నెట్ తటస్థతకు మరింత ఊతం లభించింది. ఫ్రీబెసిక్స్‌తో కలకలం రేపిన ఫేస్‌బుక్ సంస్థ ఆ కార్యక్రమాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీసుల అందుబాటు విషయంలో ఎలాంటి అంతరాలు ఉండకూడదంటూ భారత్ టెలికామ్ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ణయించిన నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ ప్రకటన చేసింది. ఫ్రీబేసిక్స్ కార్యక్రమంపై దీర్ఘకాలంగా భారత దేశంలో అన్ని వర్గాలు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతునే వచ్చింది. టెలికామ్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో వౌలిక ఇంటర్నెట్ సేవలకు ఉచితంగానే ఈ కార్యక్రమాలు ద్వారా అందించాలని నిర్ణయించిన ఫేస్‌బుక్ ఇతర సర్వీసులకు వాటి ప్రాధాన్యతను బట్టి చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇంటర్నెట్ సేవల లభ్యత విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదని సమాన ప్రాతిపదికన ఇవి అందరికీ అందుబాటులో ఉంటాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఫేస్‌బుక్ వెనుదిరిగింది. ‘ఇంక ఎంతమాత్రం ఫ్రీబేసిక్స్ భారత్‌లో అందుబాటులో ఉండవు. ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకుంటున్నాం’ అని ఫేస్‌బుక్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటర్నెట్ సమానత్వాన్ని ఉల్లంఘించడానికి వీలులేదని ట్రాయ్ తన రూలింగ్‌లో స్పష్టం చేసింది. ఆయా అంశాల ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని కూడా నిర్దేశించింది. దీన్ని ఏమాత్రం ఉల్లంఘించినా భారీగా జరిమానాలు ఉంటాయని వెబ్‌సైట్లను హెచ్చరించింది. మొదట్లో కొన్ని సంస్థలు ఫ్రీబేసిక్స్ పట్ల మొగ్గుచూపినా ట్రాయ్ నిర్ణయంతో వెనుదిరిగాయి.