జాతీయ వార్తలు

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి జెవిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్ సమక్షంలో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వేద్‌ప్రకాశ్ దుదేజా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీలో యాభై ఒక్క శాతం వాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, 49 శాతం వాటా కేంద్ర రైల్వే శాఖకు ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటయ్యే జెవిసి తెలంగాణలో చేపట్టవలసిన రైల్వే ప్రాజెక్టులను, దానికి సంబంధించిన పెట్టుబడులను సాధించే మార్గాలను ఖరారు చేస్తుంది. రైల్వే ప్రాజెక్టును గుర్తించి, పెట్టుబడులు నిర్ధారించిన అనంతరం వాటి అమలుకోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేస్తారు. ఈ ఎస్‌పివిలో పారిశ్రామిక సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు వాటాలుంటాయి. జాయింట్ వెంచర్ కంపెనీ తప్పనిసరిగా ఇరవై ఆరు శాతం వాటాలను స్పెషల్ పర్పస్ వెహికిల్‌లో తీసుకోవలసి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలతో కలిపి ఏర్పాటుచేసే ఎస్‌పివికి అది చేపట్టే ప్రాజెక్టులకుగాను ముప్పై సంవత్సరాలపాటు రాయితీలు కల్పిస్తారు. అయితే రైల్వే ప్రాజెక్టును చేపట్టే భూమిపై హక్కు స్పెషల్ పర్పస్ వెహికిల్‌తోనే ఉంటుంది. దీనిని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసేందుకు వీలుండదు. రాయితీ కాలపరిమితి ముగిసిన అనంతరం ఆ ప్రాజెక్టును తీసుకునే అధికారం రైల్వే శాఖకు ఉంటుంది. రాష్ట్రాల్లో ఉమ్మడి రంగంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకునేందుకు 17 రాష్ట్రాలు అంగీకరించగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు జెవిసిలు ఏర్పాటు చేసుకున్నాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ మరో రెండు వేల కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీనితోపాటు నాలుగు వేల రైల్వే లైన్ల గేజ్ మార్పిడి, పదకొండు వేల కిలోమీటర్ల లైను డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రుప్లింగ్ చేయాలని గత ఐదేళ్లనుండి ఆలోచిస్తున్నా పనులు కావటం లేదు కాబట్టే ఇప్పుడు రాష్ట్రాలతో జెవిసిలు ఏర్పాటు చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది.

ఢిల్లీలో గురువారం రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్ సమక్షంలో
ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వేద్‌ప్రకాశ్ దుదేజా,
తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ

లేపాక్షి ఉత్సవాలకు
తప్పకుండా రండి

నిర్మలా సీతారామన్, గడ్కరీలకు
నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహ్వానం
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సినీ నటుడు, హిం దూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్ర మం త్రులు నితిన్ గడ్కరి, నిర్మలా సీతారామన్‌లతో గురువారం భేటీ అయ్యారు. ఈ నెల 27, 28 తేదీలలో హిందూపురంలో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలకు రావాలని వారిని ఆహ్వానించారు. అనంతపురం జిల్లాలో కస్టమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్స్ నేషనల్ ఆకాడమీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హిందుపురానికి ఎంతో ఉపయోగపడే సోమదేవపల్లి- హెలహంక జాతీయ రహదారి అనుసంధానం చేయాలన్నా ప్రతిపాదనకు గడ్కరి సానుకూలత వ్యక్తం చేసినట్లు బాలకృష్ణ వెల్లడించారు. కోడికొండ చెక్‌పోస్ట్, లేపాక్షి, హిందూపురంలను కలుపుతూ జాతీయ రహదారిగా చేస్తున్నందుకు గడ్కరీకి బాలకృష్ణ ధన్యవాదలు చెప్పారు.