జాతీయ వార్తలు

అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్ తయారుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే, విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గ్ధామమన్నారు. నిలకడయిన, ముందే ఊహించగలిగే పన్నుల విధానాన్ని తీసుకొస్తున్నట్టు పెట్టుబడిదారులకు ప్రధాని హామీ ఇచ్చారు. భారత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరయిన సమయమని, ఎందుకంటే తమ ప్రభుత్వం కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం, పటిష్ఠమైన మేధోసంపత్తి హక్కుల చట్టాన్ని తీసుకురావడం లాంటి పలు పన్ను సంస్కరణలను తీసుకొస్తోందని చెప్పారు. ‘పాత పన్నుల విధానాన్ని అమలు చేయబోమని మేము ఇంతకు ముందు చెప్పాం. ఇప్పుడు మరోసారి ఆ హామీని పునరుద్ఘాటిస్తున్నాను. మా పన్నుల విధానం మరింత పారదర్శకంగా, నిలకడైనదిగా, ముందే ఊహించదగ్గదిగా ఉండేలా చూడడానికి త్వరగా చర్యలు తీసుకుంటున్నాం’ అని శనివారం ఇక్కడ ‘మేక్ ఇన్ ఇండియా’ వారోత్సవాలను ప్రారంభిస్తూ ప్రధాని అన్నారు. ఉత్పాదకతను పెంచడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోదీ వివరిస్తూ లైసెన్సులు, సెక్యూరిటీ, పర్యావరణ అనుమతులకు సంబంధించిన నిబందనలను సులభతరం, హేతుబద్ధం చేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ‘ఈ శతాబ్దం ఆసియాదని నేను పదే పదే చెబుతున్నాను. మేక్ ఇండియాను మీ కేంద్రంగా చేసుకోవాలనేది నా సలహా. ఈ శతాబ్దాన్ని మీ శతాబ్దిగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూర్చున్న వారితో పాటు ఇక్కడ లేని వారందరినీ కూడా భారత దేశ విజయగాథలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను’ అని ఆయన అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌ఢిఐ) తలుపులు బార్లా తెరిచిన దేశం బహుశా నారత దేశమేనని ఆయన అంటూ, 2014 మేలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎఫ్‌డిఐలు 48 శాతం మేర వృద్ధి చెందాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఎందుకంటే భారత దేశం ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని అన్నారు. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7 శాతం పైగానే ఉంటుందని ప్రధాని అంటూ, రాబోయే సంవత్సరాల్లో మరింత మెరుగయిన వృద్ధి రేటు ఉంటుందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఒఇసిడిలాంటి ప్రముఖ సంస్థలు అంచనా వేశాయని చెప్పారు. దేశంలో పెట్టుబడులకు ఉన్న అవకావాలను ఆయన వివరిస్తూ, 50 నగరాల్లో మెట్రో రైల్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నామని, రోడ్లు, రేవులు, రైల్వేలాంటి రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున వౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ‘ఈ నేపథ్యంలో భారత దేశాన్ని మీ కార్యస్థానంగా చేసుకోవాలని, మీ నివాసంగా చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను’ అని మోదీ అన్నారు.
chitram...

మేకిన్ ఇండియా వారోత్సవాల సదస్సులో విదేశీ పెట్టుబడుల సాధనకు భారత్ చేపట్టనున్న సంస్కరణల ప్రణాళికను విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్