జాతీయ వార్తలు

జాతి వ్యతిరేక చర్యలను ఉపేక్షించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో జాతి వ్యతిరేక శక్తులను కఠినంగా అణచివేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి అనంతకుమార్ అన్నారు. ‘జెఎన్‌యులో జాతి వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన వారిని శిక్షించాలి. పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా నినాదాలు చేసిన వారిపట్ల కఠినంగా ఉండాలి. నిందితులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడిక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి విద్యాలయాల పవిత్రత కాపాడాలన్నారు. జెఎన్‌యులో జరిగిన సంఘటనకు సంబంధించి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయా కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. కాంగ్రెస్, వామపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి జెఎన్‌యులో ఉద్రిక్త వాతావరణ సృష్టిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. కాగా బీహార్‌లో రాష్ట్ర బిజెపి శాఖ ఉపాధ్యక్షుడు విశేశ్వర్ ఓజా హత్యను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతుతో అధికార పగ్గాలు చేపట్టిన నితీశ్‌కుమార్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. కిడ్నాప్‌లు, హత్యలతో జంగిల్ రాజ్ పాలన సాగుతోందని అనంతకుమార్ విమర్శించారు. భోజ్‌పూర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం ఓజాను హత్యచేశారు. కేంద్రంలో పదేళ్లపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయే లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిందని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని కుమార్ విమర్శించారు.