జాతీయ వార్తలు

మూలవేతనం 30 శాతం పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫార్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఏడవ వేతన సంఘం సిపార్సులను పరిశీలిస్తున్న కార్యదర్శుల సాధికారిక కమిటీ వేతన సంఘం సిఫార్సు చేసిన వేతనాల పెంపును రెట్టింపు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో ఏడవ వేతన సంఘం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఇప్పుడున్న మూల వేతనంపై 23.55 శాతం పెంపును సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పెంపు 30 శాతం దాకా ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల భోగట్టా. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు తమ వేతనాల్లో పెరుగుదల 14.27 శాతమే ఉంటుందని వాదిస్తున్న ఉద్యోగులు ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఏప్రిల్ 1నుంచి నిరవధిక సమ్మె చేయాలని కూడా అనుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త వేతనాల పెపు ఈ ఏడాది జనవరి 1నుంచి అమలులోకి రావలసి ఉంది.నిజానికి గత(ఆరవ)వేతన సంఘం కూడా తన నివేదికలో ఉద్యోగుల మూల వేతనంపై 20 శాతం పెంపును మాత్రమే సిఫార్సు చేసింది. అయితే 2008లో సిఫార్సులను అమలు చేసే సమయంలో దాన్ని 40 శాతానికి పెంచారు. 7వ వేతన సంఘం సిఫార్సులను యథాతథంగా అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 1.02 లక్షల కోట్ల భారం పడనుంది. ఈ భారం రెండు మూడేళ్ల వరకు ఉండవచ్చు.