జాతీయ వార్తలు

దేశ ద్రోహం కేసులో పోలీసు కస్టడీకి గిలానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ అధ్యాపకుడు ఎస్‌ఎఆర్.గిలానీని స్థానిక కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించింది. న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి గిలానీని దేశద్రోహ అభియోగాలతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మంగళవారం గిలానీని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్వీందర్ సింగ్ ఎదుట హాజరుపరిచారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ నెల 10వ తేదీన గిలానీ నిర్వహించిన కార్యక్రమంలో కొంత మంది వ్యక్తులు పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుతో పాటు మక్బూల్ భట్ చిత్రాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించడంతో పాటు దేశానికి వ్యితిరేకంగా నినాదాలు చేశారని, భారత్ నుంచి కాశ్మీరుకు ‘విముక్తి’ కల్పించాలంటూ వారు వారు డిమాండ్ చేశారని పోలీసులు ఈ సందర్భంగా న్యాయమూర్తికి వివరించారు. గిలానీని ఇంటరాగేట్ చేసి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని గుర్తించేందుకు వీలుగా ఆయనను రెండు రోజులు తమ కస్టడీలో ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేయడంతో అందుకు హర్వీందర్ సింగ్ అంగీకరించారు. ‘నిందితులను ఇంటరాగేట్ చేయడం పోలీసుల దర్యాప్తులో అంతర్భాగం. ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమానికి కన్వీనర్‌గా వ్యవహరించిన గిలానీ భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని గుర్తించగలనని తెలిజేశాడు. కనుక ఆయనను పోలీసుల కస్టడీలో ఉంచేందుకు అనుమతిస్తున్నాం’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

చిత్రం... గిలానీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఢిల్లీ పోలీసులు