జాతీయ వార్తలు

‘హోదా’పై కేంద్రం ద్వంద్వనీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించటంలో జరుగుతున్న జాప్యం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోందని కాంగ్రెస్ సభ్యుడు జె.డి.శీలం ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక కేటగిరీ హోదాను ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తోందని ఆయన విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి ఉందని మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు సభలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాకు అంగీకరించాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో ఈమేరకు చేసిన ప్రకటనకు మరుసటి రోజు జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలియచేసింది. ఈ ప్రతిపాదన ప్రణాళికా సంఘం ఆమోదానికి వెళ్లింది. అయితే అక్కడితో ఆగిపోయిందని ఆయన చెప్పారు. ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వటానికి కావలసిన అర్హతలు ఆంధ్రప్రదేశ్‌కు లేవని, వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనకు అర్ధం లేదని ఆయన చెప్పారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయవలసిన బాధ్యత తరువాతి ప్రభుత్వంపై ఉందని శీలం చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాలకు చట్టం ద్వారాకాక ఒక కార్యనిర్వాహక ఆదేశం ద్వారా మంజూరు చేశారని ఆయన చెప్పారు. అంతేకాక ఈ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మాదిరి విభజించబడలేదని శీలం చెప్పారు. పునర్విభజన చట్టంలో ప్రత్యేక కేటగిరి హోదాప్రస్తావన లేదని కొంతమంది చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుపట్టారు. అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందునే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తదుపరి కాలంలో పెద్ద సంఖ్యలో వచ్చాయని ఆయన చెప్పారు. సమాజంలో సమానత్వం సాంఘిక ఆర్థిక రంగాలలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలుండాలన్న అంబేద్కర్ ఆశయం ఎప్పటికీ సిద్ధిస్తుందని ఆయన ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన కోరారు.