జాతీయ వార్తలు

అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జెఎన్‌యూ, జాట్ రిజర్వేషన్ల ఉద్యమం, రోహిత్ వేముల ఆత్మహత్య తదితర అన్ని వివాదాస్పద అంశాలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ హామీ ఇచ్చారు. రాజ్యసభ సమావేశాలు సజావుగా నిర్వహించే అంశంపై చర్చించేందుకు హమీద్ అన్సారీ శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగితే అన్ని వివాదాస్పద అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపవచ్చని నరేంద్ర మోదీ సూచించారు. అయితే, ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం రాజ్యసభ సమావేశాలు సజావుగా కొనసాగించటంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. రాజ్యసభలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండటం తెలిసిందే. విపక్షాలకు మెజారిటీ ఉండటంవల్లే ప్రభుత్వం లోక్‌సభ ఆమోదం తీసుకున్న బిల్లులను రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోతోంది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నఖ్వి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, సిపిఐ పక్షం నాయకుడు డి రాజా, ఎన్‌సిపి నాయకుడు త్రిపాఠి, ఆర్‌జెడి పక్షం నాయకుడు ప్రేంచంద్ గుప్తాతోపాటు సిపిఎం, జెడి(యు), బిఎస్పీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్శిటీలో వివాదం, విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌ను పోలీసులు దేశ ద్రోహ నేరం కింద అరెస్టు చేయటం, హర్యానాలో జాట్‌వర్గం బిసి రిజర్వేషన్ల ఉద్యమం, హైదరాబాద్ కేంద్రీయ వర్శిటీలో దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, ఆర్‌ఎస్‌ఎస్ కుల వివక్షకు మద్దతివ్వటం, అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయం తదితర అంశాలను రాజ్యసభలో ప్రస్తావిస్తావని కాంగ్రెస్, వామపక్షాలు, జెడి(యు), ఆర్జేడీ నాయకులు చెప్పినట్టు తెలిసింది. ప్రతిపక్షం ప్రస్తావించే ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్షం వివాదాస్పద అంశాలపై చర్చ జరిపే బదులు గొడవచేసి సభను స్తంభింపజేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం జిఎస్టీ బిల్లు, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఆమోదం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

chitram..

అఖిలపక్ష సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో
మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ