జాతీయ వార్తలు

అర్బన్ క్లస్టర్లుగా గ్రామీణ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోంగర్‌గఢ్ (చత్తీస్‌గఢ్): సమాజంలోని పేదలు, దళితులు, ఇతర అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా 300 గ్రామాలను పట్టణ అభివృద్ధి కేంద్రాలు (అర్బన్ గ్రోత్ సెంటర్లు)గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రూర్బన్ మిషన్’ను చత్తీస్‌గఢ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతమైన డోంగర్‌గఢ్‌లో ప్రధాని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుంచి యువత నగరాలకు వలస వెళ్లకుండా నిరోధించడమే ‘రూర్బన్ మిషన్’ ప్రధాన లక్ష్యని స్పష్టం చేశారు. వలసల వలన పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తూ ఇబ్బడి ముబ్బడిగా మురికివాడలు వెలుస్తున్నప్పటికీ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణులకు సౌకర్యాలు కల్పించాలన్న జ్ఞానం గతంలో ఏ ప్రభుత్వానికీ కలగలేదని ప్రధాని ఈ సందర్భంగా విమర్శించారు. ఒకవైపు గ్రామీణ స్ఫూర్తిని నిలబెడుతూనే మరోవైపు మెరుగైన జీవనం, విద్య, వైద్య, ఇంటర్నెట్ తదితర సదుపాయాలతో మారుమూల ప్రాంతాలను పట్టణ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దకపోతే భారత్ లాంటి పెద్ద దేశాలు సరైన ఆర్థికాభివృద్ధిని సాధించలేవని మోదీ పేర్కొన్నారు. సమాజంలోని పేదలు, దళితులు, గిరిజనులతో పాటు అందరికంటే అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ‘స్వచ్ఛ భారత్’, ‘రూర్బన్ మిషన్’ వంటి వివిధ పథకాలను తీసుకొచ్చామన్నారు. దేశానికి ప్రయోజనం చేకూర్చే ఏకైక మార్గం ఇదేనని, అందుకే ఈ మార్గంలో పయనాన్ని ఆరంభించామని తెలిపారు.
‘రూర్బన్ మిషన్’ కింద చుట్టుపక్కల కనీసం నాలుగు గ్రామాలకు సేవలు అందిస్తున్న గ్రామీణ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో అర్బన్ క్లస్టర్లుగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఈవిధంగా ఈ ఏడాది ఏడాదిలోనే 100 అర్బన్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని మోదీ వివరించారు. అర్బన్ క్లస్టర్ల అభివృద్ధి వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు నగరాలపై వత్తిడి తగ్గి కొత్త నగరాలు వృద్ధి చెందుతాయని, తద్వారా ఆ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని కోట్లాది మందికి లబ్ధి చేకూరుతుందని కచ్చితంగా చెప్పగలనని ప్రధాని అన్నారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.