జాతీయ వార్తలు

అన్నీ పళ్లెంలో వడ్డించాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వాల స్థాయిలో పరిష్కరించుకోవడానికి బదులు ప్రతి విషయానికీ తమను ఆశ్రయిస్తున్న ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లకోసం జాట్ సామాజిక వర్గంవారు సాగిస్తున్న ఆందోళనల కారణంగా రాజధానికి ఆగిపోయిన నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కోరింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్థకూర్, జస్టిస్ యుయు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకోకుండా ప్రతి చిన్న విషయానికీ మీరు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రతి దానికీ మేమే ఆదేశాలు జారీ చేయాలని, అన్నీ పళ్లెంలోకి వచ్చి పడాలని మీరు కోరుకుంటున్నారు. మీ మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కోర్టులో కూర్చుంటున్నారు. ఏసీ గదుల్లో సేదతీరుతూ ప్రతి విషయానికీ సుప్రీం కోర్టే ఆదేశాలు జారీ చేయాలని కోరుకుంటున్నారు’ అని ధర్మాసనం పేర్కొంటూ ఢిల్లీ సర్కారును మందలించింది. ఢిల్లీకి నీటి సరఫరా పునరుద్ధరించే విషయమై ఆ రాష్ట్ర నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రా కోర్టుకు రావడాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ పదే పదే విజ్ఞప్తి చేయడంతో రాజధానికి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా హర్యానా ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌పై తాజా స్థితిగతుల నివేదికను సమర్పించాలని కూడా హర్యానా సర్కారుకు స్పష్టం చేయడంతోపాటు ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హర్యానాలోని మునాక్ కాలువపై నిర్మించిన బ్యారేజీలకు భద్రత కల్పించాల్సిందిగా కేంద్రంతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఢిల్లీ ప్రభుత్వం తమ పిటిషన్‌లో కోరడంతో ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, సాధ్యమైనంత త్వరలో ఢిల్లీకి నీటి సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.