జాతీయ వార్తలు

దాచాల్సింది ఏమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) వివాదానికి సంబంధించిన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తిప్పికొట్టారు. సార్వత్రిక బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం ఆయన న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ, దేశంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఘటనల గురించి దాచాల్సింది ఏమీ లేదని, కనుక ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సినక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై దాడి చేసేందుకు విపక్షాలు మరో అస్త్రంగా ఎంచుకున్న హెచ్‌సియు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య విషయాన్ని కూడా వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే హెచ్‌సియులో 10 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ ఎవరు చేశారని, వీరిని ఆత్మహత్యలకు పురిగొల్పింది ఎవరని ఆయన విపక్షాలను నిలదీశారు. భారత్‌కు వ్యతిరేకంగా, పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు అనుకూలంగా జెఎన్‌యులో నినాదాలు చేయడం యావత్తు దేశాన్ని కలవరపరచిందని, దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

పర్యావరణ అనుమతుల
పిటిషన్‌పై 7న విచారణ
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ తదుపరి విచారణ మార్చి 7 తేదీకి వాయిదా పడింది. శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారించింది. కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర పర్యావరణ సాధికారిక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, సిఆర్‌డిఏలు విచారణకు హాజరయ్యాయి. కౌంటర్లు దాఖలు చేయడానికి తమకు గడువు కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశాయి. పిటిషన్ల తరపున న్యాయవాదులు, రాజధాని అనుమతులపై దాఖలైన అన్నింటినీ 7 తేదీన విచారణకు వస్తున్నందున ఆ రోజే ఈ పిటిషన్‌ను కూడా విచారణ జరపాలని కోరగా, సిఆర్‌డి, కాలుష్య నియంత్రణ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీమన్నారాయణ, ఇఎఎస్ శర్మ దాఖలు పిటిషన్ల్‌తో పాటు బొలిశెట్టి సత్యనారాయణ పిటిషన్ కూడా మార్చి 7నే విచారణకు రానుంది.